ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలతో విజయాలను సాధించిన హీరోలలో కొంతమంది హీరోలు వరుసగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటే మరి కొందరు హీరోలు మాత్రం వేగంగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. అలా ఆసక్తి చూపించని హీరోల జాబితాలో యశ్, తారక్ ఉన్నారు. యశ్, తారక్ తర్వాత ప్రాజెక్ట్ లు సెట్స్ పైకి వెళ్లడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. తొందరపడితే చరిత్ర తిరగరాయలేమని ఈ హీరోలు భావిస్తున్నారు.
తర్వాత ప్రాజెక్ట్ లు ఆలస్యమైనా పరవాలేదని ఆ సినిమాలతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఈ హీరోలు కోరుకుంటున్నారు. యశ్, తారక్ లకు సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరు హీరోల సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. ఇతర హీరోలలా తొందరపడి ఆ సినిమా ఫ్లాప్ అయితే ఆ తర్వాత బాధ పడాల్సి ఉంటుంది.
ఇండస్ట్రీ హిట్ తర్వాత సినిమా అంచనాలను అందుకోవాలంటే సులువు కాదు. తారక్, యశ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండగా ఈ హీరోల ప్రాజెక్ట్ లు వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి. తారక్ పాన్ ఇండియా డైరెక్టర్లకు మాత్రమే ఛాన్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయలకు చేరింది.
ఒక్కో సినిమాకు 300 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుండటంతో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్లు ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధపడుతున్నారు. మూడు ప్రముఖ బ్యానర్లు స్టార్ హీరోలతో వరుసగా సినిమాలను నిర్మిస్తున్నాయి. ఈ బ్యానర్లకు కూడా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. మరోవైపు స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తే ఆ సినిమాలకు ఆకాశమే హద్దుగా బిజినెస్ జరుగుతుండటం గమనార్హం.