సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తన సినీ కెరీర్ లో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. మహేశ్ బాబు సక్సెస్ రేట్ చాలా ఎక్కువనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు రెండు సంవత్సరాలకు ఒక సినిమాలో నటించే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటారు. రాజమౌళి (S. S. Rajamouli) సినిమాకు మాత్రం డేట్స్ విషయంలో మహేష్ ఎలాంటి షరతులు విధించలేదని తెలుస్తోంది. గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాకు 70 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని భవిష్యత్తు సినిమాలకు ఇదే రెమ్యునరేషన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.
అయితే మహేష్ బాబు ప్రేక్షకులకు మరింత దగ్గర కావడానికి యాడ్స్ కూడా ఒక కారణమనే సంగతి తెలిసిందే. ప్రముఖ కార్పొరేట్ కంపెనీల ఉత్పత్తులకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడంతో పాటు యాడ్స్ కోసం ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకున్నారు. అయితే యాడ్స్ ద్వారా వచ్చే మొత్తం 30 శాతం చిన్నారులు, పేదలు, వృద్ధుల అవసరాల కోసం మహేష్ బాబు ఖర్చు చేస్తున్నారు.
మహేష్ బాబు భార్య నమ్రత (Namrata Shirodkar) ఈ బాధ్యతలకు సంబంధించిన కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. యాడ్స్ ద్వారా వచ్చిన మొత్తం సంపాదనలో 30 శాతం చారిటీ కోసం ఖర్చు చేయడం అంటే సాధారణ విషయం కాదని చెప్పాలి. ఈ మొత్తం కోట్లలో ఉంటుందని సమాచారం అందుతోంది.
గతంలో ఒక సందర్భంలో ఎక్కువ సంఖ్యలో యాడ్స్ లో నటించడం వెనుక అసలు కారణాలను మహేష్ బాబు వెల్లడించడం జరిగింది. టాలీవుడ్ స్టార్స్ లో మహేష్ బాబు రూట్ సపరేట్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. మహేష్ క్రేజ్, రెమ్యునరేషన్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.