ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింఫును సొంతం చేసుకోవడంతో పాటు భారీగా విజయాలను అందుకున్న హీరోయిన్లలో రష్మిక ఒకరు. అయితే ఒకప్పుడు వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీ అయిన ఈ బ్యూటీకి ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమాలు లేవు. యంగ్ హీరోలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన రష్మిక ఇప్పుడు సీనియర్ హీరోలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీని రష్మిక రూల్ చేస్తారని అందరూ భావించగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు చెప్పుకోదగ్గ స్థాయిలో మూవీ ఆఫర్లు అయితే రావడం లేదు.
బాలీవుడ్ లో రష్మిక నటించిన గుడ్ బై మూవీ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకోగా మిషన్ మజ్ను సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచింది. యానిమల్ సినిమాపై రష్మిక ఆశలు పెట్టుకోగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ సినిమా రిజల్ట్ మరో విధంగా ఉంటే బాలీవుడ్ లో రష్మిక కెరీర్ ను కొనసాగించడమే కష్టమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రష్మిక పారితోషికం ప్రస్తుతం 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో రష్మికకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే కెరీర్ పరంగా రష్మిక చేసిన చిన్నచిన్న తప్పులు ఆమె కెరీర్ కు శాపంగా మారాయి.
తెలుగులో పుష్ప ది రూల్ సినిమాతో పాటు రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ సినిమాలో రష్మిక నటిస్తున్నారు. ఈ సినిమాలు రష్మిక జాతకాన్ని మారుస్తాయేమో చూడాలి. నితిన్ వెంకీ కుడుముల ప్రాజెక్ట్ ను మిస్ చేసుకుని రష్మిక కెరీర్ ను రిస్క్ లో పెట్టారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్మిక (Rashmika) వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!