రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఏ రిలీజ్ డేట్ ను ప్రకటించినా సినిమా రిలీజ్ సమయంలో ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతోంది. ఒక దశలో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ల వాయిదా అటు ఎన్టీఆర్ అభిమానులకు ఇటు చరణ్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి. కొన్ని రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ మేకర్స్ రెండు రిలీజ్ డేట్లను ప్రకటించడంతో ఆ రిలీజ్ డేట్లు ఇతర సినిమాల నిర్మాతలకు ఇబ్బందిగా మారాయి.
అందువల్ల టాలీవుడ్ పెద్ద సినిమాల నిర్మాతలంతా చర్చలు జరిపి ఒక సినిమాకు మరో సినిమాకు మధ్య క్లాష్ జరగకుండా రిలీజ్ డేట్లను ప్రకటించడం గమనార్హం. ఫిబ్రవరి నెలలో భీమ్లా నాయక్ రిలీజ్ కావాల్సి ఉన్నా ఆ తేదీకి రిలీజ్ కావడం సాధ్యం కాకపోతే ఈ సినిమా ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ కు భీమ్లా నాయక్ కు మధ్య వారం గ్యాప్ సరిపోతుందో లేదో ఇప్పుడే చెప్పలేము. మరోవైపు రాధేశ్యామ్ మార్చి 11వ తేదీన రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఆచార్య సినిమా ఏప్రిల్ 29వ తేదీకి ఫిక్స్ అయింది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాతే ఆచార్య రిలీజవుతూ ఉండటం గమనార్హం. కేజీఎఫ్2 మూవీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం మార్పు ఉండే అవకాశం అయితే లేదని చెప్పవచ్చు. సర్కారు వారి పాట, గని, ఎఫ్3 సినిమాల రిలీజ్ డేట్ల గురించి త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ రిలీజ్ విషయంలో ఈసారైనా జక్కన్న మాట తప్పకుండా సినిమాను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఆర్ఆర్ఆర్ సింగిల్ డేట్ ను ప్రకటించకపోతే మిగతా సినిమాలకు ఇబ్బంది కావడంతో ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీగా రికార్డులను సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!