2024 సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సినిమాల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. గుంటూరు కారం, హనుమాన్, ఈగిల్, నా సామి రంగ, విజయ్ దేవరకొండ పరశురామ్ మూవీ సంక్రాంతి రేసులో ఉన్నాయి. ఈ సినిమాలతో పాటు పలు తమిళ సినిమాలు కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నాయి. సంక్రాంతి పండుగకు ఇన్ని సినిమా థియేటర్లలో విడుదలైతే ఏ సినిమాకు థియేటర్లు దక్కవనే సంగతి తెలిసిందే. అయితే పెద్ద సినిమాల సంక్రాంతి రిలీజ్ డేట్ల ప్రకటనల వెనుక అసలు లెక్క వేరే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సంక్రాంతి పండుగకు కచ్చితంగా ప్రేక్షకులు థియేటర్లలో (Tollywood) సినిమాలను చూస్తారు. అందువల్ల సినిమాల హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడవుతున్నాయని తెలుస్తోంది. సాధారణ సమయంలో 100 కోట్ల రూపాయలు పలికే సినిమా హక్కులు సంక్రాంతి సమయంలో ఏకంగా 130 కోట్ల రూపాయలు పలుకుతాయట. సంక్రాంతికి తమ సినిమాలను రిలీజ్ చేస్తామని చెప్పి భారీ స్థాయిలో బిజినెస్ చేసి ఆ తర్వాత రిలీజ్ డేట్లను మారుస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు నిర్మాతలు బయ్యర్ల జీవితాలతో ఆడుకుంటున్నారని సమాచారం అందుతోంది.
సంక్రాంతి రేసు నుంచి రెండు నుంచి మూడు సినిమాలు తప్పుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సలార్ సినిమా ప్రభావం కూడా సంక్రాంతి సినిమాలపై ఉండనుంది. సంక్రాంతి సినిమాలలో గుంటూరు కారం సినిమాపై అంచనాలు ఎక్కువగా నెలకొన్నాయి. ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఆఫర్ వచ్చిందని సమాచారం అందుతోంది.
పాన్ ఇండియా సినిమాగా విడుదల కాకపోయినా ఈ సినిమాకు ఊహించని రేంజ్ లో కలెక్షన్లు రావడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంక్రాంతి సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. సంక్రాంతి సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.