పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రజలు సీనియర్ ఎన్టీఆర్ సినీ నేపథ్యం వల్లే రాజకీయాల్లో సక్సెస్ సాధించారని భావిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మాత్రం ఆ విషయంలో వేరే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఎన్వీ రమణ తాజాగా తెలుగు భాష దినోత్సవ సదస్సులో వర్చువల్ గా పాల్గొన్నారు.
సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి, తెలుగు భాష ప్రావీణ్యానికి గల సంబంధం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ అగ్రశ్రేణి నటుడు కావడం వల్లే రాజకీయాల్లో సులువుగా అధికారంలోకి వచ్చారని అందరూ అనుకుంటారని అప్పటి రాజకీయ పరిస్థితులు సైతం సీనియర్ ఎన్టీఆర్ కు అనుకూలియంచాని ఎన్వీ రమణ అన్నారు. అయితే ఊరూరా తిరిగి సామాన్యుడికి అర్థమయ్యే సరళమైన భాషలో ఉచ్చరించడం వల్లే సీనియర్ ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని తట్టి లేపారని ఎన్వీ రమణ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ వాక్చాతుర్యం ఆయన సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని ఎన్వీ రమణ అన్నారు. అమ్మ భాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఎన్వీ రమణ సూచనలు చేశారు. ఇంగ్లీష్ భాష మోజులో పడి తెలుగును నిర్లక్ష్యం చేయవద్దని ఎన్వీ రమణ వెల్లడించారు. మాతృభాష విశిష్టత గురించి మాట్లాడుతూ ఎన్వీ రమణ ఈ విషయాలను చెప్పుకొచ్చారు. అమ్మ భాషను మాట్లాడటం ప్రతి ఒక్కరూ గౌరవంగా భావించాలని ఎన్వీ రమణ తెలిపారు. మాతృభాష లేకపోతే మనుగడ లేదని ఎన్వీ రమణ కామెంట్లు చేశారు.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!