Boney Kapoor: శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఆ ఆస్తులను అమ్మేయడానికి అసలు కారణాలివేనా?

అతిలోక సుందరి శ్రీదేవి భౌతికంగా మరణించినా అభిమానుల హృదయాల్లో తను నటించిన సినిమాల ద్వారా ఇప్పటికీ జీవించి ఉన్నారు. శ్రీదేవి భర్త సీనియర్ సినీ నిర్మాత బోనీ కపూర్, ఆయన కూతుళ్లు జాన్వీ, ఖుషీ ముంబైలోని అంధేరిలో ఉన్న నాలుగు ఫ్లాట్లను విక్రయించినట్టు సమాచారం అందుతోంది. నవంబర్ నెల 2వ తేదీన ఇందుకు సంబంధించిన ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. మొత్తం 12 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఈ డీల్ జరిగినట్టు సమాచారం అందుతోంది.

ప్రస్తుతం జాన్వీ కపూర్ వరుసగా సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో జాన్వీ కపూర్ పారితోషికం ఉంది. జాన్వీ కపూర్ ఇప్పటివరకు నటించిన సినిమాలేవీ మరీ భారీ స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దేవర సినిమాతో జాన్వీ కపూర్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. జాయింట్ ఆస్తులు కావడంతో ఈ ఆస్తులను అమ్మేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈ ఆస్తులను అమ్మేసినా త్వరలో జాన్వీ కపూర్ లగ్జరీ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేయనున్నారని సమాచారం అందుతోంది. జాన్వీ కపూర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం జాన్వీ కపూర్ చేతినిండా ఆఫర్లు ఉన్నాయి. యాడ్స్, ఫోటోషూట్స్ ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో జాన్వీ కపూర్ సంపాదిస్తున్నారు. జాన్వీ కపూర్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగడంతో పాటు రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలను సృష్టించాలని అభిమానులు ఫీలవుతున్నారు.

స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్న జాన్వీ కపూర్ ఈ సినిమాలతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది. జాన్వీ కపూర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సోషల్ మీడియాలో సైతం జాన్వీ కపూర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. ఉమ్మడి ఆస్తులు ఉండకూడదనే కారణంతో (Boney Kapoor) బోనీ ఈ ఆస్తులను అమ్మేసినట్లు తెలుస్తోంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus