ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందనే సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో అజయ్ దేవగణ్ ఎక్కడా కనిపించలేదు. అయితే అజయ్ దేవగణ్ పాత్రకు సైతం ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే.
అజయ్ దేవగణ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో కనిపించకపోవడానికి ముఖ్యమైన కారణమే ఉంది. అజయ్ దేవగణ్ సొంత బ్యానర్ లో తెరకెక్కే సినిమాలు మినహా ఇతర బ్యానర్ల సినిమాల ప్రమోషన్స్ పై పెద్దగా ఆసక్తి చూపరు. అదే సమయంలో ఏ సినిమాలో నటిస్తారో ముందుగానే మేకర్స్ కు ఈ విషయం చెప్పి అంగీకరిస్తే మాత్రమే అజయ్ దేవగణ్ నటిస్తారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కు అజయ్ దేవగణ్ రాకపోవడం వెనుక అసలు రీజన్ ఇదేనని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ కు బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా ఆడియన్స్ ఈ సినిమా విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే కలెక్షన్లు అంచనాలకు మించి ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ మీడియా సైతం చరణ్, తారక్ నటనను ప్రశంసిస్తుండటం గమనార్హం. బాలీవుడ్ దిగ్గజాల నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, చరణ్ ఖాతాలో మరో సక్సెస్ చేరింది. మహేష్ రాజమౌళి కాంబో సినిమాపై కూడా భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పటినుంచి మొదలవుతుందో చూడాల్సి ఉంది. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.