Nagarjuna: ఆ రీజన్ వల్లే నాగ్ రాజకీయాలకు దూరమా?

  • October 1, 2022 / 02:04 PM IST

సాధారణంగా సినిమా రంగంలో ఊహించని స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్న సెలబ్రిటీలు రాజకీయాల్లో కూడా చేరి సక్సెస్ సాధించాలని భావిస్తూ ఉంటారు. స్టార్ హీరో నాగార్జున తన సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలను అందుకున్నారు. తన సినీ కెరీర్ లో నాగార్జున ఎంతోమంది కొత్త దర్శకులకు అవకాశాలను ఇచ్చి విజయాలను అందుకున్నారు. పలు సినిమాలను సొంతంగా నిర్మించిన నాగార్జునకు నిర్మాతగా కూడా ఆ సినిమాలు భారీ లాభాలను అందించాయి.

వ్యాపారవేత్తగా, బిగ్ బాస్ షో హోస్ట్ గా కూడా నాగార్జున ప్రశంసలను అందుకున్నారు. రాజకీయాల్లోకి నాగార్జున ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న నాగార్జున సులువుగానే రాజకీయాల్లో సక్సెస్ అవుతారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీతో సన్నిహితంగా ఉన్న నాగార్జున ఆ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయనున్నారని ప్రచారం జరగగా ది ఘోస్ట్ సినిమా ఈవెంట్ లో నాగ్ పాలిటిక్స్ కు సంబంధించి క్లారిటీ ఇచ్చారు.

తాను ఎంపీగా పోటీ చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆ ప్రచారాన్ని తాను అస్సలు పట్టించుకోనని నాగ్ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఈ ప్రచారం జరుగుతోందని నాగార్జున చెప్పుకొచ్చారు. పొలిటికల్ లీడర్ గా సినిమా చేస్తానే తప్ప రియల్ లైఫ్ లో పొలిటికల్ లీడర్ అనిపించుకోవాలని లేదని నాగార్జున కామెంట్లు చేయడం గమనార్హం.

వైరల్ అవుతున్న పుకార్లకు సంబంధించి నాగ్ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఆ వార్తలు ఇకనైనా ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది. అయితే నాగ్ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందని కొంతమంది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. 2024 ఎన్నికలకు మరో 19 నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఆ సమయానికి రాజకీయాల విషయంలో నాగ్ మనసు మారుతుందేమో చూడాల్సి ఉంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే ఇతరులకు విమర్శలు చేసే అవకాశం ఇచ్చినట్టేనని నాగ్ భావిస్తున్నారని బోగట్టా.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus