Balakrishna, Boyapati Srinu: హ్యాట్రిక్‌ కొట్టిన బాలయ్య – బోయపాటి… కారణాలు ఇవే..!

సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్లకు చాలా బలం ఉంటుంది. హీరో – డైరక్టర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్‌ కాగానే… ఆ సినిమా పక్కా హిట్‌ అని తేల్చేస్తుంటారు పరిశీకులు, అభిమానులు. ఈ క్రమంలో చాలావరకు అంచనాలు నిజమవుతుంటాయి. అలాంటి జోడీల్లో నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను ఒకటి. ‘అఖండ’ తాజాగా హ్యాట్రిక్‌ విజయం సాధించిన ఈ ఇద్దరి కలయిక… గురించి ఇప్పుడు టాలీవుడ్‌ మొత్తం మాట్లాడుతోంది. అంతగా అలరించడానికి ఈ జోడీ స్పెషలేంటో చూద్దాం!

హీరోను అభిమానులకు నచ్చేలా చూపించడం దర్శకుడి మొదటి స్పెషాలిటీ అవ్వాలి అంటుంటారు. అభిమాన హీరో సినిమా అభిమానులకు నచ్చకపోతే ఎలా. అలా అని ప్రేక్షకులకు నచ్చక్కర్లేదా అంటే అదీ కావాలి. దానికి కథ, కథనం, కాన్సెప్ట్‌ లాంటివి ఉపయోగపడతాయి. ఈ మొత్తం విషయాలను పక్కాగా కుదుర్చుకుని సినిమాలు చేస్తున్నారు కాబట్టే బాలకృష్ణ – బోయపాటి సక్సెస్‌ అవుతూ వస్తున్నారు. ‘సింహా’తో మొదలైన ఈ జోడీ ‘లెజెండ్‌’తో డబుల్‌ మజా అందించింది. ఇప్పుడు ‘అఖండ’ అంటూ హ్యాట్రిక్‌ కొట్టింది.

ఎమోషన్‌, ఎలివేషన్‌, ట్విస్ట్‌లు, కథ, కథనం… ఇవన్నీ కలిపి సినిమా తీయడం, హిట్‌ కొట్టడం అంత ఈజీ కాదు. బోయపాటికి వీటి విషయం చాలా పట్టు ఉంది. అందులోనూ ఇలాంటి అంశాలను బాలకృష్ణ సినిమాలో చూపించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ సినిమాల్లో చూస్తే… ఇద్దరు బాలకృష్ణలు ఉంటారు. ఒకరు తుపాను అయితే, ఇంకొకరు సునామీ. రెండు పాత్రలకూ డిఫరెంట్‌ ఎమోషన్‌ ఉంటుంది. అలాగే ఏ పాత్రకు ఆ పాత్ర స్థాయి ఎలివేషనూ ఇస్తారు.

ఇక ట్విస్ట్‌లు సంగతి అంటారా. డ్యూయల్‌ రోల్‌లో పెద్ద బాలకృష్ణ ఎంట్రీ ఎప్పుడూ ట్విస్ట్‌గానే ఉంటుంది. కథ, కథనం గురించి చర్చ అక్కర్లేదు అనుకుంటా. పక్కగా కథ రాసుకుంటాంటారు బోయపాటి. అయితే ఈ మూడు సినిమాల కథలు ఒకేలా ఉన్నాయి అనే వాదనలూ వినిపిస్తుంటాయి. కానీ ప్రతి సినిమాలోనూ ఓ కొత్త బాలయ్యను చూస్తున్నాం అంటే అది బోయపాటి మ్యాజిక్కే అని చెప్పొచ్చు. ముఖ్యంగా సీనియర్‌ బాలయ్య పాత్రను ఆయన రాసుకున్న విధానం, దాన్ని బాలకృష్ణ పోషించిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఇక ఆఖరి పాయింట్‌ విలన్‌. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలు చూస్తే… అందులో విలన్‌ పాత్ర చాలా భయంకరంగా ఉంటుంది. రాక్షసత్వానికి, పైశాచికానికి కేరాఫ్‌ అడ్రెస్‌గా నిలుస్తుంటుంది ఆ పాత్ర. ‘లెజెండ్‌’లో జగపతిబాబు, ‘అఖండ’లో శ్రీకాంత్‌ పాత్రలు అలాంటివే. విలన్‌ పాత్ర అంత బలంగా ఉంది కాబట్టే… హీరో బాలయ్య పాత్ర ఇంకా ఎలివేట్‌ అవుతోంది. BB కాంబో హ్యాట్రిక్‌ విజయాలకు వీటిని కారణాలు చెప్పుకోవచ్చు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus