ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని గతంలో ప్రకటన వెలువడింది. అయితే ప్రాజెక్ట్ కే గ్లింప్స్ లో మాత్రం రిలీజ్ డేట్ కు సంబంధించి ఎలాంటి ప్రకటన లేకపోవడం ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్ లోకి నెట్టోస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ సాధ్యం కాదని విజువల్ ఎఫెక్ట్స్ వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం కానుందని తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు.
ప్రభాస్ గత సినిమాలలో చాలా సినిమాలు విజువల్ ఎఫెక్ట్స్ వల్ల ఆలస్యమైన సందర్భాలు ఉండగా ఈ సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. అయితే ప్రాజెక్ట్ కే సినిమా ఎప్పుడు విడుదలైనా సెన్సేషన్ సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రాజెక్ట్ కే మూవీ నైజాం హక్కులు 80 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. ఈ సినిమా (Kalki Movie) ఇతర ఏరియాల హక్కులకు సైతం భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది.
ప్రభాస్ వేగంగా సినిమాల్లో నటిస్తుండగా ఈ ఏడాది ప్రభాస్ నటించిన రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. వచ్చే ఏడాది కూడా ప్రభాస్ నటించిన రెండు లేదా మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. ప్రభాస్ కథల ఎంపికలో, టెక్నీషియన్ల ఎంపికలో జాగ్రత్త వహించాలని గ్రాఫిక్స్, మ్యూజిక్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదిగి టాలీవుడ్ కీర్తి ప్రతిష్టలను పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ కు రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలు దక్కుతాయని స్టార్ హీరోగా మరింత ఎత్తుకు ఎదుగుతాడని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ ఇతర ఇండస్ట్రీలలో సైతం మార్కెట్ ను పెంచుకునే దిశగా అడుగులు వేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా సినిమాకు ప్రభాస్ మార్కెట్ పెరుగుతోంది. ప్రభాస్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.