Acharya Release Date: ఆచార్య రిలీజ్ విషయంలో వాస్తవం ఇదే!

ఈ ఏడాది రిలీజవుతున్న భారీ బడ్జెట్ సినిమాలలో ఆచార్య సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. కరోనా నిబంధనలు, ఇతర కారణాల వల్ల ఆచార్య మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా పడింది. అయితే ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాతే ఆచార్య మూవీ రిలీజ్ కావాలనే ఒప్పందం చిరంజీవి, రాజమౌళి మధ్య ఉందని గత కొన్నిరోజులుగా వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ మూవీకి రెండు రిలీజ్ డేట్లను ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ మూవీ ఏప్రిల్ 28వ తేదీన విడుదలైతే ఆచార్య మళ్లీ వాయిదా పడుతుందా? అనే సందేహాన్ని మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తుండగా ఆచార్య రిలీజ్ డేట్ విషయంలో చిరంజీవి రాజమౌళికి ఇప్పటికే తేల్చి చెప్పారని సమాచారం. థియేటర్ ఓనర్ల నుంచి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి ఉందని ఆచార్య రిలీజ్ డేట్ ను మరోసారి మార్చే అవకాశం అయితే లేదని చిరంజీవి జక్కన్నకు క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. మార్చి సెకండ్ వీక్ సమయానికి కరోనా కేసులు తగ్గే అవకాశంతో పాటు ఏపీలో టికెట్ రేట్లు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

ఆచార్య ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా ఈసారి రిలీజ్ డేట్ విషయంలో మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆచార్యను చాలాసార్లు పోస్ట్ పోన్ చేయించిన రాజమౌళి సైతం ఈసారి ఆచార్య రిలీజ్ విషయంలో జోక్యం చేసుకోకూడదని భావిస్తున్నారని బోగట్టా. ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలలో చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ నటించిన సినిమా విడుదలై మూడేళ్లు కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాల కొరకు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ ఎప్పుడు రిలీజైనా 1500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకుడు కాగా ఈ దర్శకుని తర్వాత ప్రాజెక్ట్ త్వరలో మొదలుకానుంది. ఫిబ్రవరి నెల నుంచి ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus