Bro Movie: బ్రో సినిమాలో పవన్ ను డామినేట్ చేశారా.. సాయితేజ్ సమాధానం ఏంటంటే?

పవన్ సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ మరో 24 గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వినోదాయ సిత్తం రీమేక్ కు బ్రో అనే టైటిల్ ఎందుకు ఫిక్స్ చేశారనే ప్రశ్నకు సంబంధించి తాజాగా సమాధానం దొరికేసింది. సాయితేజ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

బ్రో సినిమాలో మామయ్యను నేను బ్రో అని పిలుస్తానని మామయ్య కూడా నన్ను బ్రో అని పిలుస్తారని అందుకే ఈ సినిమాకు బ్రో టైటిల్ ఫిక్స్ అయిందని సాయితేజ్ అన్నారు. పవన్ సాయితేజ్ ను పిలిచే పిలుపు బ్రో కావడం వల్లే ఈ సినిమా టైటిల్ గా బ్రో ఫిక్స్ అయిందని పవన్ కళ్యాణ్ అభిమానులు ఫీలవుతున్నారు.

సినిమాలో ఏ సీన్ లో అయినా పవన్ ను డామినేట్ చేశారా అనే ప్రశ్నకు సాయితేజ్ స్పందిస్తూ నటులెవ్వరూ ఇతరులను డామినేట్ చేయరని ఎవరి పాత్రకు అనుగుణంగా వారు నటిస్తారని గురువులా భావించే పవన్ కళ్యాణ్ తో కలిసి స్క్రీన్ ను పంచుకోవడమే గొప్పగా ఫీల్ అవుతానని సాయితేజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమాలో హీరోయిన్ తో బ్రేకప్ తర్వాత మద్యం తాగే సీన్ ఉంటుందని అది రియల్ లైఫ్ కు దగ్గరగా ఉంటుందని సాయితేజ్ అన్నారు.

నిజ జీవితంలో అమ్మాయిలకు టైమ్ లేదని చెప్పకూడదని అలా చెప్పడం తన దృష్టిలో తప్పు అని సాయితేజ్ అన్నారు. పూర్తిస్థాయిలో పని చేయాలంటే మాత్రమే రాజకీయాల్లోకి రావాలని మామయ్య చెప్పారని నాకు మద్దతు ఇవ్వడానికి రాజకీయాల్లోకి రావడం కరెక్ట్ కాదని మామయ్య చెప్పారని సాయితేజ్ అన్నారు. బ్రో (Bro Movie) సినిమాతో పవన్, సాయితేజ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారేమో చూడాలి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus