మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఖలేజా మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. అటు మహేష్, ఇటు త్రివిక్రమ్ అభిమానులకు ఈ సినిమా ఎంతగానో నచ్చినా రిలీజ్ సమయంలో నెగిటివ్ టాక్ రావడం ఈ సినిమాకు ఒకింత మైనస్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు ఈ మూవీ టైటిల్ వివాదాల్లో చిక్కుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఖలేజా అనే టైటిల్ ను ఈ సినిమా మేకర్స్ కంటే ముందే మరో సినిమా మేకర్స్ రిజిష్టర్ చేయించుకోవడంతో సమస్య మొదలైంది.
టైటిల్ ను రిజిష్టర్ చేసుకున్న వ్యక్తి ఖలేజా (Khaleja Movie) మూవీ రిలీజ్ ను ఆపాలంటూ ఇంజెక్షన్ ఆర్డర్ కోరారు. నష్ట పరిహారం ద్వారా న్యాయం కోరమని కోర్టు సూచనలు చేయగా సదరు వ్యక్తి కోర్టు బయట ఖలేజా నిర్మాతలను 10 లక్షల రూపాయల పరిహారం కోరగా వాళ్లు వెంటనే అంగీకరించారు. తక్కువ మొత్తం అడిగి తప్పు చేశానేమో అని భావించిన ఆ వ్యక్తి కోర్టులో మాత్రం ఏకంగా 25 లక్షల పరిహారం కావాలని కోరారు.
అయితే టైటిల్ రిజిష్టర్ చేయించుకున్న వ్యక్తి తమతో 10 లక్షల రుపాయలకు ఒప్పందం చేసుకుని మాట మార్చారని ఈ సినిమా మేకర్స్ ప్రూవ్ చేశారు. కోర్టు ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసి మరికొన్ని ఆధారాలను తీసుకొనిరావాలని టైటిల్ రిజిష్టర్ చేయించుకున్న వ్యక్తికి సూచించింది. సినిమా రిలీజ్ ను ఆపలేమని చెప్పడంతో ఖలేజా అనుకున్న విధంగా విడుదలైంది.
అయితే ఇబ్బందులు రాకూడదని మేకర్స్ మహేష్ ఖలేజా అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. టైటిల్ ను రిజిష్టర్ చేయించుకున్న వ్యక్తికి అత్యాశ వల్ల రూపాయి కూడా దక్కలేదు. మహేష్ ను, మహేష్ మూవీ నిర్మాతలను మోసం చేయాలని అనుకున్న వ్యక్తికి భారీ షాక్ తగిలింది. ఖలేజా సినిమాకు శింగనమల రమేష్ బాబు, సి.కళ్యాణ్ నిర్మాతలుగా వ్యవహరించారు.