వరుస మరణాలతో చిత్ర పరిశ్రమలో ఆందోళన నెలకొన్న సమయంలో.. ఇటీవల మృతి చెందిన ప్రముఖ యువనటి కేవలం తన నిర్లక్ష్యం కారణంగానే కన్నుమూసిందనే వార్తతో అంతా షాక్ అయ్యారు.. పాపులర్ మలయాళీ యాక్ట్రెస్ సుబి సురేష్.. కొద్ది కాలంగా లివర్ సమస్యలతో బాధపడుతున్నారు.. కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి చేయి దాటడంతో బుధవారం (ఫిబ్రవరి 22) ఉదయం తుదిశ్వాస విడిచారు.. ఆమె వయసు 41 సంవత్సరాలు.. యాంకర్, యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకున్న సుబి సురేష్‌కి మలయాళంలో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..
పలు షోలకు హోస్ట్‌గానూ వ్యవహరించారామె.. ఇదిలా ఉంటే.. ఆమె సమయానికి సరిగా తినకపోవడం కారణంగా అనారోగ్యానికి గురవడం.. డాక్టర్ హెచ్చరించినా నిర్లక్ష్యం చేయడం వల్లనే మరణించినట్టు తెలుస్తోంది.. ఆరు నెలల క్రితం సుబి తన అనారోగ్యం గురించి మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. తన సొంత యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసిన ఆ వీడియోలో ఆమె ఏం చెప్పిందంటే.. ‘‘సమయానికి తినడం, మందులు వేసుకోవడం వంటి మంచి అలవాట్లు నాకు లేవు.. దీని వల్ల ఓసారి షూటింగ్‌కి ముందు రోజు గుండెల్లో నొప్పి వచ్చింది..
పైగా దీనికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా తోడైంది.. ఆ తర్వాత రోజు ఏమీ తినకలేకపోయాను.. ఒకటే వాంతులు.. కొబ్బరి నీళ్లు తాగినా కానీ వాంతు చేసుకున్నాను.. రెండు రోజుల పాటు ఏమీ తినలేకపోయాను.. డాక్టర్ దగ్గరకెళ్తే పోటాషియం చాలా తక్కువగా ఉంది.. సరిగా తినాలని చెప్పారు.. నిజానికి చాలా మంది నాకు డబ్బు పిచ్చి, తిండి కూడా తినకుండా మనీ వెంట పరిగెడుతుంటానని అనుకుంటారు.. కానీ అది నిజం కాదు..
చాలా కాలం తర్వాత వరుసగా కొత్త ప్రాజెక్టులు వస్తుండడంతో ఉత్సాహంగా చేసుకుంటూ వెళ్లాను.. నా ఫోకస్ డబ్బు మీద కాదు.. పని మీదే.. ఈ క్రమంలో సరైన ఫుడ్ తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేశాను.. ఈ విషయంలో మా అమ్మా, సోదరుడు ఎప్పుడూ తిడుతుండేవారు.. నాకు ఇష్టమైనవి తెచ్చి పెట్టినా కన్నెత్తి చూసేదాన్ని కాదు.. ఆకలిగా ఉన్నా తినకపోవడం నాకున్న చెడ్డ లక్షణం.. దీంతో నా శరీరంలో మాగ్నీషియం, పోటాషియం, సోడియం లెవల్స్ పడిపోవడంత పరిస్థితి క్లిష్టంగా తయారయింది.. ఫస్ట్ నుండి కేర్ తీసుకుని ఉండే ఈ పరిస్థితి వచ్చేవి కాదు..
షూటింగ్ నుండి లేటుగా వచ్చినప్పుడు డైరెక్ట్‌గా బెడ్ రూమ్ లోకి వెళ్లి వాటర్ తాగి పడుకునేదాన్ని.. ప్రతిసారీ ఇలాగే చేయడంతో రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది.. కొన్నాళ్ల పాటు నిర్లక్ష్యంగా ఉన్న నేను ఇప్పుడు రోజుకి మూడు సార్లు తింటున్నాను.. అందుకే అనుభవంతో చెప్తున్నాను.. టైంకి తినడం అలవాటు చేసుకోండి’’ అని చెప్పుకొచ్చారు.. ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు.. ‘మీ నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. సుబి సురేష్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..