చిరంజీవి, చరణ్ హీరోలుగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆచార్య సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. మెగాభిమానులు ఈ సినిమా అద్భుతంగా ఉందని చెబుతుండగా న్యూట్రల్ ఆడియన్స్ మాత్రం ఈ సినిమా అంచనాలకు అనుగుణంగా లేదని చెబుతున్నారు. అయితే ఈ సినిమాకు సోషల్ మీడియా వల్లే డ్యామేజ్ జరిగిందని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆచార్య ట్రైలర్ విడుదలైన సమయంలోనే ఈ సినిమాపై అంచనాలు ఒకింత తగ్గాయి.
భారీ అంచనాలతో సినిమాను చూడవద్దని కొరటాల శివ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అయితే ఈరోజు ఉదయం నుంచి ఈ సినిమాకు సంబంధించి వైరల్ అవుతున్న మీమ్స్, ట్రోల్స్ ఈ సినిమాకు ఏ స్థాయిలో డ్యామేజ్ చేయాలో ఆ స్థాయిలో డ్యామేజ్ చేశాయి. సోషల్ మీడియా ఆచార్యపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. ఆచార్యకు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగకపోవడానికి ట్రైలర్ కారణం కావడం గమనార్హం. అయితే ఆచార్యకు టాక్ ఆశించిన విధంగా లేకపోయినా
ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రోమోలు విడుదల చేసి ప్రమోషన్స్ చేస్తే కొంతమేర మెరుగైన ఫలితం ఉంటుంది. ఆచార్య మేకర్స్ ఈ దిశగా దృష్టి పెడతారో లేదో చూడాలి. ప్రమోషన్ హడావిడి మాత్రమే ఈ సినిమాను కాపాడే ఛాన్స్ అయితే ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రాజమౌళి ఏ స్థాయిలో ప్రమోషన్స్ చేశారో తెలిసిందే. ఆయితే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో పావు వంతు ప్రమోషన్స్ కూడా ఆచార్యకు జరగలేదు. ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం రాజమౌళిని ప్రశంసించడానికే సరిపోయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఆచార్య తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. ఆచార్యకు భారీ బడ్జెట్ కూడా ఒకింత మైనస్ అయింది. ఈ సినిమాకు చిరంజీవి, చరణ్ ఇంకా రెమ్యునరేషన్లు తీసుకోలేదు. ఆచార్యకు నష్టాలు వస్తే మెగా హీరోల రెమ్యునరేషన్లపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది.