Balakrishna: బాలయ్య బాబీ కాంబో మూవీ ఇంటర్వెల్ సీన్ అలా ప్లాన్ చేశారా?

బాలయ్య బాబీ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడినప్పటి నుంచి బాలయ్య ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనున్న నేపథ్యంలో ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పొలిటికల్ టచ్ ఉంటుందని బోగట్టా. 2024 ఎన్నికలకు ముందే ఈ సినిమా రిలీజ్ కానుండగా పొలిటికల్ టచ్ ఉన్న ఇంటర్వెల్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది.

బాబీ సినిమాకు బాలయ్య ఓకే చెప్పడానికి అసలు కారణం ఇదేనని బోగట్టా. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో బాలయ్య ప్రతి సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికవుతుండటం గమనార్హం. బాలయ్య థమన్ మధ్య మంచి అనుబంధం ఉండటంతో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ రేసులో దేవిశ్రీ ప్రసాద్, అనిరుధ్ కూడా ఉన్నారు.

అయితే బాలయ్య (Balakrishna) బాబీ కాంబోకు పని చేసే లక్కీ ఛాన్స్ ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి. బాలయ్య బాబీ కాంబో మూవీలో నటించే నటీనటులకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. దర్శకుడు బాబీ వరుసగా సీనియర్ స్టార్ హీరోల సినిమాలకు పని చేసే అవకాశాలను దక్కించుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య సక్సెస్ తో బాబీ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో పెరిగింది.

బాబీ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులను మెప్పించేలా బాబీ సినిమాలను తెరకెక్కిస్తుండటం గమనార్హం. బాలయ్య బాబీ కాంబో మూవీ రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus