Chiranjeevi: ఎన్టీఆర్ కొండవీటి సింహం సినిమాను చిరంజీవి బీట్ చేసింది ఆ విషయమేనా..?

  • May 29, 2023 / 07:48 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ తర్వాత మళ్లీ అలాంటి స్టార్ స్టేటస్ దక్కించుకున్న హీరో చిరంజీవి. ఎన్టీఆర్ లానే చిరంజీవి కూడా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ తర్వాత ఆయన కుటుంబం నుంచి వారసులు వచ్చిన విధంగానే చిరంజీవి ఫ్యామిలీ నుంచి సైతం టాలీవుడ్ లో ఎందరో వారసులు వచ్చి స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. చిరంజీవి తన కెరీర్ మొదట్లో హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. ముందుగా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటిస్తూ చిత్ర పరిశ్రమలో కొనసాగాడు.

కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి స్టార్ హీరోగా మారాడు. చిరు హీరోగా ఎదుగుతున్న సమయంలోనే అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, కృష్ణలాంటి హీరోలకు గట్టి పోటీ ఇచ్చారు. అయితే చిరంజీవి స్టార్ హీరోగా ఎదగకముందే ఎన్టీఆర్‌ను తన సినిమాతో బీట్ చేశాడు. ఈ విషయం చాలామందికి తెలియదు. 1981లో ఎన్టీఆర్, చిరంజీవి నటించిన సినిమాలు ఒకే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఆ రెండు సినిమాలలో ఎన్టీఆర్ నటించిన సినిమాపై చిరంజీవి సినిమా ఘన విజయం సాధించింది.

చిరంజీవి 1981లో చట్టానికి కళ్ళు లేవు అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాను చంద్రశేఖర్ తెరకెక్కించాడు. అదే సంవత్సరం అక్టోబర్ 30న ప్రేక్షకులు ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌ గా నిలిచింది. ఇక అదే సంవత్సరం అదే నెలలో నటరత్న ఎన్టీఆర్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కొండవీటి సింహం సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో నటించాడు. ఈ సినిమా కూడా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.

చిరంజీవి (Chiranjeevi) నటించిన చట్టానికి కళ్ళు లేవు సినిమా, కొండవీటి సింహం సినిమాను బీట్ చేసింది.హైదరాబాదులోని సంధ్యా థియేటర్ లో ఈ సినిమా 107 రోజులు ఆడింది. అదేవిధంగా కొండవీటి సింహం ఆ థియేటర్ లో 100 రోజులు ఆడింది. ఈ విధంగా చిరంజీవి తన కెరీర్ మొదటిలోనే ఎన్టీఆర్ ను బీట్ చేశాడు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus