స్టార్ హీరో ప్రభాస్ వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ ఎవరినీ హర్ట్ చేయడానికి ఇష్టపడరని ఇండస్ట్రీలో పేరుంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నా సహాయం చేసే విషయంలో ముందుండే ప్రభాస్ ఆ సహాయాల గురించి ప్రచారం చేసుకోవడానికి ఇష్టపడరు. స్టార్ హీరో ప్రభాస్ తో పని చేసిన హీరోయిన్లు సైతం చాలా సందర్భాల్లో ఆయన గురించి పాజిటివ్ గా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. అయితే రాధేశ్యామ్ సినిమా విషయంలో మాత్రం భిన్నంగా జరిగింది.
ప్రభాస్, పూజా హెగ్డే మధ్య గొడవలు వచ్చాయని ఆ గొడవల వల్ల ఒకరితో మరొకరు మాట్లాడుకోవడానికి ఒకరికొకరు ఎదురుపడటానికి కూడా ఇష్టపడటం లేదని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రభాస్ పూజా హెగ్డే మధ్య ఉన్న గొడవల వల్ల ప్రభాస్ పూజా హెగ్డే డూప్ లతో ఒక సాంగ్ ను షూట్ చేశారని ప్రచారం జరిగింది. ప్రభాస్ ఉంటే పూజా హెగ్డే డబ్బింగ్ థియేటర్ లో డబ్బింగ్ కూడా చెప్పలేదని వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలను రాధేశ్యామ్ మేకర్స్ గతంలోనే ఖండించినా ప్రభాస్, పూజా హెగ్డే ఒకేచోట కనిపించకపోవడంతో చాలామంది ఈ వార్తలను నిజమేనని నమ్మారు. రాధేశ్యామ్ ప్రమోషన్స్ కు పూజా హెగ్డే హాజరు కాకపోవచ్చని వార్తలు వచ్చాయి. అయితే పూజా హెగ్డే వైరల్ అయిన వార్తలకు చెక్ పెట్టారు. రాధేశ్యామ్ రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ లో పూజా హెగ్డే సందడి చేయడంతో పాటు ప్రభాస్ తో కలిసి ఫోటోలు దిగారు. పూజా హెగ్డే గురించి ఈ తరహా రూమర్స్ రావడం ఇదే తొలిసారి అనే సంగతి తెలిసిందే.
ప్రభాస్, పూజా హెగ్డే రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ రూమర్ల గురించి స్పందిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాధేశ్యామ్ రిలీజ్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా ఈ సినిమాతో మరో సక్సెస్ సాధిస్తామని రాధేశ్యామ్ మేకర్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. భారీ బడ్జెట్ తో రాధేశ్యామ్ తెరకెక్కగా ఈ సినిమా నిర్మాతలకు ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాల్సి ఉంది. పూజా హెగ్డేపై కావాలనే కొంతమంది తప్పుగా ప్రచారంచేశారని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.