Shankar, Jr NTR: ఎన్టీఆర్- శంకర్ ప్రాజెక్ట్ అలా మిస్ అయ్యిందట.. మరి ఇప్పుడు?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించే సినిమాలు తెలుగులో కూడా విడుదలై సూపర్ హిట్ అవుతుంటాయి. తెలుగు సినిమాలతో పోటీ పడి మరీ అవి రికార్డు కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి శంకర్ అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. మెగాస్టార్ చిరంజీవి అంతటి హీరో అడిగినా శంకర్ సినిమా చేయడానికి ఆలోచించారు. ఎందుకంటే ఆయన తెరకెక్కించే సినిమాలు అన్నీ లార్జ్ స్కేల్లో ఉంటాయి. చాలా గ్రాండియర్ గా ఉంటాయి.

కాబట్టి… పక్క భాషల్లో కూడా మార్కెట్ ఉన్న హీరోలను ఎంపిక చేసుకునేవారు. ఓ దశలో మహేష్ బాబుతో 3 ఇడియట్స్ ను రీమేక్ చేసేందుకు ట్రై చేశారు. అది కూడా బైలింగ్యువల్ మూవీగా. తమిళ్ లో విజయ్ నటిస్తే తెలుగులో మహేష్ తో చేసేలా ప్లాన్ చేసాడు. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. ‘ఆర్.ఆర్.ఆర్’ చేసాడు కాబట్టి పాన్ ఇండియా ఇమేజ్ కలిసొస్తుంది అని చరణ్ తో సినిమాని సెట్ చేసుకున్నాడు.

దీని తర్వాత ఎన్టీఆర్ తో కూడా సినిమా ఉంటుందట. కొరటాల, ప్రశాంత్ నీల్ మూవీ ఫినిష్ అయ్యాక ఎన్టీఆర్.. శంకర్ తో మూవీ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ పుట్టినరోజున ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజానికి 8 ఏళ్ళ క్రితమే ఎన్టీఆర్ తో సినిమా చేస్తానని శంకర్ చెప్పాడట.

కానీ శంకర్ తో ఇది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు అని ఎన్టీఆర్ తన సినిమాలతో బిజీ అయిపోయాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ను శంకర్ వచ్చి కలిసి ఓ కథ చెప్పాడట. కొద్ది మార్పులతో దానికి ఓకె చెప్పినట్టు తెలుస్తుంది.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus