రవీందర్- మహాలక్ష్మీల పెళ్లి వెనుక ఇంత కథ ఉందా..!

కోలీవుడ్ నిర్మాత రవీందర్, బుల్లితెర నటి వీజే మహాలక్ష్మిల పెళ్లి వ్యవహారం దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకుని పాపులర్ అయిన జంట ఇదే అని చెప్పాలి. అందులోనూ వీరిది ప్రేమ వివాహం. పైగా ఇద్దరికీ ఆల్రెడీ పెళ్ళై విడాకులు తీసుకోవడం కూడా జరిగింది. ఈ జంట ఇంత పాపులర్ అవ్వడానికి ముఖ్య కారణం రవీందర్ భారీ ఖాయంతో ఉండటం…మహాలక్ష్మీ సన్నగా అమ్మాయిలా ఉండడమే.

దీంతో ఆమె రవీందర్ ను పెళ్లి చేసుకుంది కేవలం డబ్బు కోసమే అంటూ అంతా భావించి ట్రోల్ చేశారు. అయితే అందులో నిజం లేదని ఈ జంట ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్లారిటీ ఇచ్చారు. ఇద్దరు మనసులు కలవడం వల్లనే ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు ఈ దంపతులు తెలిపారు. అయితే వీరి పెళ్లి పై అలాగే మహాలక్ష్మి పై మరో నటి జయశ్రీ సంచలన కామెంట్లు చేసింది. ‘మహాలక్ష్మికి నా భర్తతో ఎఫైర్ ఉంది. అందుకే మహాలక్ష్మీ మొదటి భర్త ఆమెను వదిలేశాడు.

నా భర్త నా ముందే మహాలక్ష్మీకి వీడియో కాల్ చేసి మాట్లాడేవాడు. అలాగే ఆమె కొడుకు నా భర్తను నాన్న అని పిలుస్తున్నాడు అంటూ జయశ్రీ షాకింగ్ కామెంట్స్ చేసింది.’ ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అయితే ఇది పాత వీడియో. ఈ వార్తలపై మహాలక్ష్మి స్పందించి క్లారిటీ ఇవ్వడం జరిగింది.

“జయశ్రీ కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుంది, ఇందులో ఎంత మాత్రం నిజం లేదు” అంటూ తెలిపింది. ‘నా వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న టైంలో రవీందర్ నాకు అండగా నిలబడ్డాడు. అందుకే అతన్ని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాను’ అంటూ ఈమె చెప్పుకొచ్చింది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus