Hero Nani: ‘దసరా’ సినిమా దర్శకుడికి ఓకే చెప్పడానికి నాని అంత చేశాడా?

నేచురల్ స్టార్ నాని.. క్లాప్ బాయ్ గా కెరీర్ ను మొదలుపెట్టి అటు తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఇంద్రగంటి మోహన్ కృష్ణ సహకారంతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమా తర్వాత నాని పెద్ద హీరో అవుతాడు అని ఊహించిన వాళ్ళు లేరు. కానీ కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన కథల్ని ఎంపిక చేసుకుని.. సక్సెస్ లు సాధించి ‘నాని సినిమా’ అంటే ఓ బ్రాండ్ అనేలా చేశాడు.

అయితే తన ఇమేజ్ పెరిగినా కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం మాత్రం మానలేదు. మరో వారం పది రోజుల్లో రాబోతున్న ‘దసరా’ సినిమా కొత్త దర్శకుడితో చేసిందే. శ్రీకాంత్ ఓదెల అతని పేరు. ‘దసరా’ సినిమాని ఇతను ఏ రేంజ్లో చిత్రీకరించాడో ఆల్రెడీ టీజర్, ట్రైలర్ లు చెప్పకనే చెప్పాయి. అయితే శ్రీకాంత్ ఓదెలకి నాని దర్శకుడిగా అవకాశం ఇవ్వడం వెనుక ఓ బ్యాక్ స్టోరీ కూడా ఉంది. నాని వంటి పెద్ద హీరో ఓ కొత్త కుర్రాడికి అంత ఈజీగా ఎలా అవకాశం ఇచ్చేస్తాడు చెప్పండి.

నాని కూడా అదే భావించి.. శ్రీకాంత్ కు ఓ పరీక్ష పెట్టాడట. ఆ పరీక్ష ఏంటంటే.. మొదటి శ్రీకాంత్ కథ వినడానికి నాని గంట టైం ఇచ్చాడు.కానీ కథలో లీనమైపోయి మొత్తం 4 గంటల పాటు ఆ కథ విన్నాడట. అయితే ఎంత బాగా నెరేట్ చేసినా.. శ్రీకాంత్ అనుకున్న విధంగా ఆ కథని తెరకెక్కించగలడా? అనే సందేహం నానికి కలిగింది. దీంతో షార్ట్ ఫిలిం తీయడానికి కూడా సరిపడని డబ్బులు శ్రీకాంత్ కు ఇచ్చి..

తాను చెప్పిన కథలో రెండు సీన్లు డైరెక్ట్ చేసి చూపించమని చెప్పాడట నాని. శ్రీకాంత్ కూడా తనకు తెలిసిన బ్యాచ్ తో ఆ సీన్లు డైరెక్ట్ చేసి చూపించాడు. అవి చూసిన నాని వెంటనే ఓకే చెప్పేసి ‘ఈ సినిమా మనం చేస్తున్నాం’ అని భరోసా ఇచ్చాడట. ఇది కొంచెం మనకి ‘నేనింతే’ సినిమాలో రవితేజ- సుబ్బరాజు ల ట్రాక్ ను గుర్తుచేస్తుంది కదా. ఇక ‘దసరా’ సినిమా మార్చ్ 30న రిలీజ్ కాబోతోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus