ఈ ముగ్గురు సెలబ్రిటీల విషయంలో ఉన్న కామన్ పాయింట్ గమనించారా?

సాధారణంగా చాలామందికి భగవంతుడిపై నమ్మకం ఉండదు మరికొందరు ఎంతగానో విశ్వసిస్తూ ఉంటారు. ఇలా భగవంతుడిని నమ్మినవారు వారు ఎక్కడికి వెళ్లినా వారితో పాటు భగవంతుడు ఉన్నారనే నమ్మకం ధైర్యం వారిలో ఉంటుంది.ఇక ఏదైనా ఒక విషయంలో సమస్యలను ఎదుర్కొని చావు అంచుల వరకు వెళ్లి వచ్చినవారు భగవంతుడిపై ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి నమ్మకాలను ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలు విశ్వసిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు కొనసాగుతున్నటువంటి వారిలో సమంత సాయి పల్లవి సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే ఈ ముగ్గురు గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ ముగ్గురు ఈ మధ్యకాలంలో బయట ఎక్కడ కనిపించడం మనకు చేతిలో రుద్రాక్ష మాల ధరించి కనపడుతూ ఉంటారు.ఇలా రుద్రాక్ష మాల ధరించడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే సాయి పల్లవికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ కావడంతో ఈమె మొదట నుంచి చేతికి రుద్రాక్ష మాల ధరించి కనపడుతున్నారు. ఇక సాయి ధరమ్ తేజ తాజాగా బైక్ ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ఈయన మానసిక ప్రశాంతత కోసం, ధైర్యం కోసం రుద్రాక్ష మాలలను ధరించి జపం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే సాయి ధరంతేజ్ ఈ మధ్యకాలంలో బయటకు వచ్చిన ప్రతిసారి చేతికి రుద్రాక్ష మాలలు ధరించి కనపడుతున్నారు. ఇక సమంత కూడా మయోసైటిసిస్ వ్యాధి నుంచి బయటపడిన తర్వాత చేతికి రుద్రాక్షమాలతో కనపడుతున్నారు.

నాగచైతన్యత విడాకులు అలాగే ఈ వ్యాధి తనని వెంటాడటంతో పూర్తిగా మానసిక సంఘర్షణకు లోనైనా సమంత మానసిక ప్రశాంతత కోసం తనకు మనోధైర్యాన్ని కలిగించడం కోసం ఇలా రుద్రాక్ష మాల ధరించి మానసిక ప్రశాంతతను పొందుతున్నారని తెలుస్తుంది. ఇలా ఈ సెలబ్రిటీలందరూ రుద్రాక్ష మాలలను ధరించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus