ఆర్.పి.పట్నాయక్ ను సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది దర్శకుడు శ్రీను వైట్ల. ‘నీకోసం’ చిత్రం ద్వారా అతను సంగీత దర్శకుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. కానీ అందరూ దర్శకుడు తేజ.. ఆర్.పి.పట్నాయక్ ను టాలీవుడ్ కు పరిచయం చేశాడు అనుకుంటారు. ఎందుకంటే వీరి కాంబినేషన్లో వచ్చిన మ్యూజికల్ హిట్స్ అలాంటివి. ‘చిత్రం’ ‘ఫ్యామిలీ సర్కస్’ ‘నువ్వు నేను’ ‘జయం’ ‘నిజం’.. ఈ సినిమాలు అన్నీ మ్యూజికల్ హిట్సే. అయితే తర్వాత ఈ కాంబినేషన్ కు గ్యాప్ వచ్చింది.
మధ్యలో ఉదయ్ కిరణ్ తో తేజ (Teja) చేసిన ‘ఔనన్నా కాదన్నా’ కి ఆర్.పి సంగీతం అందించాడు. మళ్ళీ ఆ తర్వాత వీరి కాంబోలో సినిమా రాలేదు. తేజ ఎక్కువగా అనూప్ రూబెన్స్ నే సంగీత దర్శకుడిగా పెట్టుకుంటూ వచ్చాడు. దీంతో వీళ్ళ మధ్య మనస్పర్థలు వచ్చాయి అంటూ ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా.. మళ్ళీ ఇంతకాలానికి వీరి కాంబినేషన్లో ‘అహింస’ అనే సినిమా వస్తుంది.
దీనికి ఆర్.పి.పట్నాయక్ సంగీత దర్శకుడే కానీ ఆర్.ఆర్ అనూప్ తో కొట్టించాడు తేజ. ఈ క్రమంలో అసలు ఆర్.పి ఎందుకు దూరం పెట్టారు అని తేజని డైరెక్ట్ గా ప్రశ్నించగా… ‘ఆర్.పి మధ్యలో నటుడిగా, డైరెక్టర్ గా సినిమాలు చేయాలి అనుకుంటున్నట్టు తెలిపాడు. అందుకే అతని వద్ద కీ బోర్డు ప్లే చేసే అనూప్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేశాను. ‘అహింస’ కి కూడా అతను కీ బోర్డు వాయించాడు. ఇప్పుడు అతను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి.. క్రెడిట్స్ ఇవ్వాలని ఆర్.ఆర్.విభాగంలో అతని పేరు కూడా వేశాను ‘ అంటూ తేజ క్లారిటీ ఇచ్చాడు.
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!