Trivikram: భీమ్లా నాయక్ ఈవెంట్.. త్రివిక్రమ్ ఎందుకు మాట్లాడలేదంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో భీమ్లా నాయక్ కూడా టాప్ లిస్టు లో ఉంది. బుధవారం రోజు జరిగిన ఈ వేడుకకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ వేడుకలో ప్రతి ఒక్కరు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన పనికి ఎంతగానో మెచ్చుకున్నారు. ఆయన లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చి ఉండేది కాదు అని కూడా అన్నారు.

Click Here To Watch

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు స్క్రీన్ ప్లే అందించిన విషయం తెలిసిందే. అయితే అంత చేసిన త్రివిక్రమ్ భీమ్లా నాయక్ ఈవెంట్ లో ఎక్కువగా ఎందుకు కనిపించలేదు. ఎందుకు మాట్లాడలేదు అనే విషయంలో అనేక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొదట రిలీజ్ ఈవెంట్ లో ఎక్కడా కనిపించలేదు. చివరి సమయంలో కేటీఆర్ గారిని ప్రత్యేకంగా కలిసి ఫొటోకి స్టిల్ ఇచ్చి అక్కడి నుంచి మాయమయ్యారు. ఆయన మాట్లాడతారు అని చాలా మంది అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.

కానీ త్రివిక్రమ్ సైలెంట్ గా అక్కడి నుంచి జారుకున్నారు. దీంతో ఆయన అలా ఉండటానికి కారణం ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఆ వివరాల్లోకి వెళితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కావాలనే దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నిరకాలుగా ఒక దర్శకుడి తరహాలో పని చేస్తున్నాడు అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. డైరెక్షన్ చేసింది సాగర్ కె చంద్ర అయినప్పటికీ కూడా త్రివిక్రమ్ అన్ని చేసుకుంటున్నారని అని అనడం ఏమాత్రం నచ్చలేదట.

దీంతో ఆయన సాగర్ ని హైలెట్ చేయాలి అని సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ భీమ్లా నాయక్ సినిమాను మొదలు పెట్టినప్పటి నుంచి కూడా దగ్గరుండి అన్ని చూసుకున్నాడు. ఫైనల్ గా అసలైన వేడుకలో మాత్రం ఆయన మాట్లాడకపోవడం ప్రేక్షకులకు అసంతృప్తిని మిగిల్చింది.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus