Katrina Kaif: టాలీవుడ్ కత్రినాను బ్యాన్ చేయడానికి కారణాలు ఏంటంటే!

కత్రినా కైఫ్.. బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది.. స్టార్ హీరోయిన్ స్టేటస్‌తో కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ.. ఒకనొక టైంలో హిందీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ అండ్ బిజీయెస్ట్ యాక్ట్రెస్‌గా మారిపోయింది.. గతేడాది యాక్టర్ విక్కీ కౌశల్‌ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. తర్వాత కెరీర్ కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి మరి.. ఇప్పుడు కత్రినా టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. తెలుగు ఇండస్ట్రీ తనను కొన్ని కారణాల వల్ల బ్యాన్ చేసిందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది..

ఈ ఎన్నారై అమ్మడు అమితాబ్, జాకీ ష్రాఫ్ నటించిన ‘బూమ్’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమా సాలిడ్ షాక్ ఇచ్చింది. దీంతో, కొత్త భామలను వెతికి పట్టుకొచ్చే విక్టరీ వెంకటేష్ పక్కన ‘మల్లీశ్వరి’ లో ఛాన్స్ ఇచ్చాడు అన్నయ్య సురేష్ బాబు.. ఇక్కడ మొదటి చిత్రం సూపర్ హిట్.. వర్మ ‘సర్కార్’ తర్వాత బాలయ్యతో ‘అల్లరి పిడుగు’ లో ఆడిపాడింది. ఈ మూవీ రిజల్ట్ ఏంటనేది తెలిసిందే.. అప్పటినుండి తెలుగులో కనిపించలేదు.. ఎందుకంటే దీనికి కొన్ని కారణాలు చెప్తున్నారు..

‘మల్లీశ్వరి’ కి కత్రినా తీసుకున్న పారితోషికం అప్పట్లో టాాలీవుడ్‌లో హాట్ టాపిక్.. దాదాపు కోటి రూపాయలు తీసుకుందని.. షూటింగ్‌కి లేట్‌గా వస్తుందని వెంకీ బ్రదర్ నిర్మాత సురేష్ బాబు ఓ ఇంటర్వూలో చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే.. ఆమె హైట్ గురించి కూడా టాక్స్ నడిచాయి.. వెంకటేష్, బాలకృష్ణల సరసన నటించిన కత్రినాకి.. ఎక్కువగా కామెంట్స్ వచ్చింది మాత్రం బాలయ్య పక్కన యాక్ట్ చేసినప్పుడే.. హీరోయిన్ పొట్టిగా ఉన్నా కానీ గ్లామర్‌గా కనిపించాలి..

మరీ ఇంత హైట్ ఉంది.. హీరోలు నిచ్చెన వేసుకోవాలి.. ఆమెకి ఈ హైటే మైనస్ అని మాట్లాడినవారున్నారు. అందుకే, ఈ పొడుగు కాళ్ళ సుందరి తెలుగు ఇండస్ట్రీలో ఇమడలేకపోయింది. పైగా మొదటి సినిమాకి ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవడం మన నిర్మాతలకు మింగుడు పడలేదు.. అలాగే దర్శక నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తుందనే వార్తలు కూడా రావడంతో.. స్టార్ హీరోలెవరూ కత్రినాను తమ సినిమాల్లో తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదు..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus