శ్రీహాన్ బాత్రూమ్ లో ఉంటే కీర్తి డోర్ ఎందుకు తీసింది. శనివారం బ్రేక్ టైమ్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో ఫినాలేవారం గేమ్ చాలా రసవత్తరంగా మారింది. ఈవారం తర్వాత హౌస్ మేట్స్ అందరూ పైనల్స్ కి చేరుకుంటారు. అందుకే, ఒక్కొక్కరు చాలా ఆతృతగా కనిపిస్తున్నారు. అయితే, శనివారం శ్రీహాన్ కి కీర్తికి మద్యలో కొద్దిగా మాటల యుద్ధం జరిగింది. నాగార్జున ఈవిషయాన్ని ప్రత్యేకంగా మరీ చూపించారు. శ్రీహాన్ బాత్రూమ్ లో ఉన్నప్పుడు కీర్తి ఎవరూ లేరు అనుకుని లాక్ తీయబోయింది. లోపల నుంచీ ఎలాంటి సౌండ్ రాకపోవడంతో డోర్ లాక్ అయ్యిందేమో అని గట్టిగా తీసేందుకు ప్రయత్నించింది. ఈలోగా శ్రీహాన్ లోపల నుంచీ నేనున్నానంటూ అరిచాడు.

డోర్ వచ్చేసేసరికి లోపల తను డోర్ ని గట్టిగా ముందుకు పెట్టాడు. బయటకి వచ్చిన తర్వాత దీనిపైన పెద్ద యుద్ధమే జరిగింది. ఎందుకు అరుస్తున్నావ్ అంటూ కీర్తి శ్రీహాన్ ని రెచ్చగొట్టింది. దీంతో బాత్రూమ్ లో ఉన్నప్పుడు అరవకపోతే నువ్వు లాక్ తీయడానికి ప్రయత్నిస్తున్నావ్ కదా అంటూ రెచ్చిపోయాడు. ఇద్దరూ కాసేపు వాగ్వివాదం చేసుకున్నారు. ఈ టాపిక్ అక్కడితో అయిపోయిందని అనుకున్నారు అందరూ. కానీ, శ్రీహాన్ అరిచినందుకు కీర్తి ఫీల్ అయ్యింది.నాగార్జున ఎపిసోడ్ ఎండ్ అయిపోయిన తర్వాత శ్రీసత్య శ్రీహాన్ కి ఈవిషయంలో ఎక్స్ ప్లైయిన్ చేసేందుకు ప్రయత్నించింది.

ఆ తర్వాత మార్నింగ్ శ్రీహాన్ కి శ్రీసత్యకి మద్యలో కూడా మాటల యుద్ధం జరిగింది. అక్కడ నేను అరిచిందే కనిపిస్తోంది కానీ, తను చేసింది కనిపించడం లేదా అంటూ శ్రీహాన్ నిలదీశాడు. అంతేకాదు, ఫ్రెండ్షిప్ లో నువ్వు మారిపోయావ్ అని, గతంలో కీర్తిపై చాడీలు చెప్పిన నువ్వే ఇప్పుడు తనతో కలిసిపోయావ్ అంటూ మాట్లాడాడు. నువ్వు మారిపోయావ్ అంటే నువ్వు మారిపోయావ్ అని ఇద్దరూ వాదించుకున్నారు. ఆ తర్వాత అమ్మాయిలు – అబ్బాయిల డెసీషన్ గురించి మేటర్ వచ్చింది.

మీరు కెమెరాలతో వెళ్లి విషయం చెప్తే మాకు ఎలా తెలుస్తుంది. మా ముందు మీరు డిస్కస్ చేయాలి కదా అని అన్నాడు శ్రీహాన్. దీంతో శ్రీసత్యకి ఇంకా శ్రీహాన్ కి పోట్లాట జరిగింది. మాటల్లో మాట కీర్తి వాష్ రూమ్ విషయం కూడా వచ్చింది. దీనికి శ్రీహాన్ ఎక్స్ ప్లనేషన్ ఇచ్చాడు. ఇక ఫైనల్ వీక్ చేరుకున్న హౌస్మేట్స్ అయి శ్రీసత్య, శ్రీహాన్ తమ ఫ్రెండ్షిప్ గురించి , బాండింగ్ గురించి మాట్లాడుకోవడం, ఇలా పోట్లాడుకోవడం అనేది వీరిద్దరి మద్యలో జరిగింది.

పొగరు కాదు సెల్ఫ్ రెస్పక్ట్ అంటూ ఇద్దరూ బలంగా వాదించుకున్నారు. ఆ తర్వాత ఇనయా కూడా శ్రీసత్యతో మాట్లాడింది. డెసీషన్ తీస్కుంది నేను అయితే నీపైన ఎందుకు కోపం అంటూ మాట్లాడింది. ఇక ఈ గొడవ తర్వాత శ్రీసత్య, రేవంత్, శ్రీహాన్ ముగ్గురూ కూడా కలిసిపోయారు. మళ్లీ మాములుగానే గేమ్ లో పార్టిసిపేట్ చేశారు. మొత్తానికి అదీ మేటర్.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus