SSMB28: చాలా ఏళ్లుగా త్రివిక్రమ్ దాచుకున్న టైటిల్!

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా రాబోతుందని అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు..? విలన్ గా ఎవరు చేయబోతున్నారు..? సినిమా టైటిల్ ఏంటి..? ఇలా రకరకాల వార్తలు మీడియాలో వస్తున్నాయి. అయితే ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ గా ‘పార్ధు’ అనే పేరుని ఫిక్స్ చేశారని.. టైటిల్ గా కూడా దీన్నే ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. నిజానికి ఈ టైటిల్ వెనుక చాలా స్టోరీ ఉంది.

దర్శకుడు త్రివిక్రమ్ చాలా ఏళ్లుగా ఈ సినిమా టైటిల్ ను దాచుకుంటున్నారట. ఎప్పటికప్పుడు రెన్యూవల్ చేయించుకుంటూ వస్తున్నారు. ఎంతమంది అడిగినా ఇవ్వడం లేదు. ఈ టైటిల్ ను చాలా ఏళ్ల క్రితమే రిజిస్టర్ చేయించారట. ‘అతడు’ సినిమాలో మహేష్ పాత్ర పేరు పార్ధునే. అందుకే త్రివిక్రమ్ కు అంత ఆసక్తి అనుకునే పొరపాటు. అసలు విషయం ఏంటంటే.. త్రివిక్రమ్ కు ఇష్టమైన రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి. ఆమె రాసిన నవళ్లలో ‘పార్ధు’ ఒకటి. అప్పటినుండే ఆ పేరంటే త్రివిక్రమ్ కు ఇష్టం. ఆ పేరునే ‘అతడు’ సినిమాలో మహేష్ కు వాడారు.

అప్పటినుండి ఆ టైటిల్ ను రిజిస్టర్ చేయించి.. ఎప్పటికైనా సినిమా తీయాలని అలా ఉంచారు. ఆ మధ్య నాగశౌర్య ‘లక్ష్య’ సినిమా కోసం ఇదే టైటిల్ ను అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ టైటిల్ ఇవ్వకపోవడంతో ‘లక్ష్య’ను ఫిక్స్ చేసుకున్నారు. అంతకముందు కూడా కొందరు దర్శకనిర్మాతలు త్రివిక్రమ్ ను టైటిల్ అడిగారట. కానీ ఆయన మాత్రం టైటిల్ ను రెన్యూవల్ చేయించుకుంటూ దాచుకుంటున్నారు. ఇప్పుడు ఇదే టైటిల్ ను మహేష్ సినిమాకి పెట్టబోతున్నట్లు టాక్ మొదలైంది. కానీ అందులో నిజం లేదని సమాచారం!

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus