హిట్ టాక్ వచ్చినా.. క్యాష్ చేసుకోలేకపోయాయి

2021 లో ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించాయి. ‘మాస్టర్’ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ వంటి చిత్రాలకు హిట్ టాక్ అయితే ఏమీ రాలేదు. కానీ అవి మంచి కలెక్షన్లను రాబట్టి సూపర్ హిట్లు అయ్యాయి. ‘అల్లుడు అదుర్స్’ వంటి రొట్ట సినిమా కూడా యావరేజ్ కలెక్షన్స్ ను సాధించింది. కానీ మినిమం గ్యారెంటీ హీరోలుగా పేరొందిన నితిన్, శర్వానంద్ సినిమాలు మాత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికీ డిజాస్టర్లు గా మిగలడం షాక్ ఇచ్చే అంశం.

అవును నితిన్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో వచ్చిన ‘చెక్’ అలాగే శర్వానంద్- కిషోర్ డైరెక్షన్లో వచ్చిన ‘శ్రీకారం’ చిత్రాలు మంచి టాక్ ను సంపాదించుకున్నప్పటికీ కలెక్షన్స్ ను రాబట్టలేకపోయాయి.ఇందుకు ప్రధాన కారణం..ఆ సినిమాలు విడుదలయ్యే టైంకి టికెట్ రేట్లు పెంచడమే అని కొందరు విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ‘చెక్’ టీజర్, ట్రైలర్ లు సినిమా పై అంచనాలను పెంచాయి.దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి సినిమాలు క్లాస్ ను ఆకర్షిస్తూ ఉంటాయి.

కానీ ‘చెక్’ చిత్రాన్ని వారు పక్కన పెట్టడానికి కారణం టికెట్ హైక్స్ వల్లే అని తెలుస్తుంది. ఇక శ్రీకారం విషయంలో కూడా అదే జరిగింది. ‘భలేగుంది బాల’ పాట అలాగే టీజర్, ట్రైలర్లతో సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.సినిమా చూసిన వాళ్ళు మెసేజ్ కూడా కూడా బాగుంది అన్నారు. కానీ టికెట్ రేట్లు పెంచేసరికి ఓటిటిలో చూడొచ్చులే అని మిగిలిన ప్రేక్షకులు థియేటర్లకు రాలేదు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus