సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి సినిమాలు తగ్గించినా ఇప్పటికీ మంచి క్రేజ్ ఉన్న నటుడుగానే జనాలు గుర్తిస్తారు. ‘స్వయంవరం’ ‘చిరునవ్వుతో’ ‘హనుమాన్ జంక్షన్’ ‘పెళ్ళాం ఊరెళితే’ ‘కళ్యాణ రాముడు’ ‘ఖుషి ఖుషీగా’ ‘శ్రీకృష్ణ 2006’ ‘యమగోల మళ్ళీ మొదలైంది’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నాడు వేణు. 9 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు వేణు. ఈ చిత్రంలో అతను సీఐ మురళి పాత్రలో కనిపించబోతున్నాడు.
వేణు కామెడీ టైమింగ్ సూపర్, ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా జీవించేస్తాడు. ఏ డైలాగ్ అయినా సరే అతను చెబితే అది జనాల్లోకి ఇట్టే వెళ్ళిపోతుంది. మొన్నామధ్య వేణు కొంతమంది హీరోలకు డబ్బింగ్ చెప్పారు అంటూ వార్తలు వచ్చాయి. దీనిని బట్టి.. డబ్బింగ్ ఆర్టిస్ట్ లకు రావాల్సిన గుర్తింపు రావడం లేదని స్పష్టమవుతుంది.సినిమాల్లో మనకి వేణు పాత్ర నుండి వినపడేది వేణు ఒరిజినల్ వాయిస్ కాదు. అవును వేణుకి డబ్బింగ్ చెప్పేది వాయుపుత్ర నాగార్జున గారు.
వేణు నటించిన 25 సినిమాలకు ఈయనే డబ్బింగ్ చెప్పారు. వాయుపుత్ర నాగార్జున గారు ఓ కాలేజ్ ప్రొఫెసర్. ఈయన టాలీవుడ్లో చాలా మంది హీరోలకు డబ్బింగ్ చెప్పారు. ‘స్టైల్’ ‘సంతోషం’ చిత్రాల్లో ప్రభుదేవాకి, ‘సరైనోడు’ లో అల్లు అర్జున్ తండ్రి పాత్ర పోషించిన జయప్రకాష్, ‘దూకుడు’ లో సుమన్ కి, విలన్ గా చేసే ప్రదీప్ రావత్ కు, ‘అపరిచితుడు’ సినిమాలో హీరో ఫ్రెండ్ గా చేసిన వివేక్ కు, ‘సత్యం శివం’ సినిమాలో మాధవన్ కు…
వాయుపుత్ర నాగార్జున గారే డబ్బింగ్ చెప్పారు. ఏ నటుడికి అయినా పర్ఫెక్ట్ గా.. అలాగే ఆ నటుడి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా డబ్బింగ్ చెప్పడం ఈయన ప్రత్యేకత.ఇలాంటి టెక్నీషియన్లు ఎంతో మంది తెరవెనుకే ఉండిపోతున్నారు. వాళ్లకు రావాల్సిన పేరు ప్రఖ్యాతలు రావడం లేదు. వాయుపుత్ర నాగార్జున గారు కూడా ఏనాడూ ఫేమ్ కోసం తాపత్రయ పడలేదు.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!