రామ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కిన ది వారియర్ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో ప్రదర్శితమవుతుండగా రామ్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పాజిటివ్ గా చెబుతున్నారు. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను బట్టి ఈ సినిమా తుది ఫలితం గురించి క్లారిటీ రానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ది వారియర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన స్టార్ మా ఛానెల్ దక్కించుకుందని సమాచారం అందుతోంది. ది వారియర్ రిలీజైన 50 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. సెప్టెంబర్ రెండో వారం నుంచి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉండే ఛాన్స్ అయితే ఉంది. రామ్ కెరీర్ లోనే ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో రిలీజైన సినిమాగా ది వారియర్ మూవీ నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో 700కు పైగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కావడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా 1300కు పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కాగా ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానెల్ దక్కించుకుందని సమాచారం అందుతోంది. ది వారియర్ సినిమాకు 43 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.
ఈ సినిమా బిజినెస్ కు తగిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. రామ్ తర్వాత సినిమాలపై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. కెరీర్ విషయంలో రామ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రామ్ తర్వాత సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.