The Warriorr: ఆ ఏరియా హక్కులను రామ్ కొనుగోలు చేశారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో ఒకరైన రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. రామ్ గత సినిమా రెడ్ యావరేజ్ గా నిలిచినా రామ్ అభిమానులకు మాత్రం ఈ సినిమా ఎంతగానో నచ్చింది. తడమ్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కావడంతో ఈ సినిమాపై ఇతర సినిమాల ఎఫెక్ట్ ఎక్కువగా పడింది. ప్రస్తుతం రామ్ లింగుస్వామి డైరెక్షన్ లో ది వారియర్ అనే సినిమాలో నటిస్తున్నారు.

రామ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా రామ్ కు జోడీగా కృతిశెట్టి ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడవుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమా వైజాగ్ హక్కులను హీరో రామ్ కొనుగోలు చేశారని 4.32 కోట్ల రూపాయలకు ఆయన హక్కులు తీసుకున్నారని సమాచారం అందుతోంది.

ఈ సినిమా నిర్మాతలకు థియేట్రికల్ హక్కుల ద్వారా 40 కోట్ల రూపాయల ఆదాయం దక్కే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులకు కూడా మంచి డిమాండ్ నెలకొంది. ది వారియర్ ఫలితంపై ఉన్న కాన్ఫిడెన్స్ వల్లే రామ్ హక్కులను కొనుగోలు చేశారని తెలుస్తోంది. రామ్ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

మిడిల్ రేంజ్ హీరోలలో నంబర్ 1 హీరోగా ఎదిగేలా రామ్ అడుగులు వేస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రామ్ భవిష్యత్తు సినిమాల డైరెక్టర్ల జాబితాలో మరి కొందరు డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus