సూపర్ స్టార్ కృష్ణ.. ఇది ఒక పేరు మాత్రమే కాదు. ఒక బ్రాండ్. టాలీవుడ్ తెరపై ఆయన సంతకం ఎప్పటికీ ఉంటుంది. జీవితంలో ఆయన చూడని ఉన్నత స్థానాలు లేవు, పడని కష్టాలు కూడా లేవు. నటుడిగా తొలి అవకాశం కోసం, ఆ తర్వాత వచ్చి అవకాశాల్ని ఒడిసిపట్టుకునే ప్రయత్నాలు, స్టార్ హోదా వచ్చాక దాన్ని ఇంకా పెంచుకునే పనులు ఇలా కృష్ణ చాలా కష్టపడ్డారు. అయితే ఆయన జీవిత కాలంలో కొన్ని కోరికలు ఉండిపోయాయి అంటారు సన్నిహితులు.
కృష్ణ… కథానాయకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు వచ్చి.. నిర్మాత అయ్యారు, ఆ తర్వాత స్టూడియో ఓనర్ అయ్యారు, ఆ తర్వాత దర్శకుడు, ఎడిటర్ కూడా అయ్యారు. 350కి పైగా సినిమాల్లో నటించారు. ఇలాంటి రికార్డులు ఎన్నో ఆయన జీవితంలో ఉన్నాయి. అవి కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఆయన ఎంతో ఘనంగా చెప్పుకునే ఘనతలు సాధించారు. కొడుకుల్ని హీరోల్ని చేశారు, నిర్మాతల్ని చేశారు. అల్లుడు, మనవళ్లు కూడా నటులు అయ్యారు. అయితే కొన్ని చేయాలనుకుని చేయలేకపోయారు.
చారిత్రక పాత్రలను పోషించడం అంటే కృష్ణకు చాలా ఇష్టం. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా ఆ ఆలోచన నుండి వచ్చినదే. అయితే కృష్ణకు ఛత్రపతి శివాజీగా కనిపించాలనే కోరిక ఉండేదట. దీని కోసం ఒకటి రెండుసార్లు ప్రయత్నించినా వీలుపడలేదు. అయితే ‘చంద్రహాస’ సినిమాలో కాసేపు శివాజీగా అలరించారు అంతే. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా తర్వాత శివాజీ చేద్దాం అనుకున్నా.. వర్గాల మధ్య ఇబ్బంది వస్తుందేమో అనే ఆలోచనతో ఆపేశారు. అలా శివాజీగా కనిపించాలనే ఆయన కోరిక అలానే ఉండిపోయింది.
తనలా తన కొడుకును చూసుకోవాలని ఏ తండ్రికి ఉండదు చెప్పండి. కృష్ణ కూడా అదే అనుకున్నారు. కొడుకు విషయంలో చాలావరకు చేశారు కూడా. నటుడిగా, ప్రయోగాలకు వెరవకుండా ముందుకు రావడంలో మహేష్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అయితే కృష్ణకు మరో ఆలోచన ఉంది. అదే మహేష్‌ను జేమ్స్ బాండ్‌గా చూడాలని. మహేష్ ఒడ్డు, పొడుగు, ఇమేజ్ ఇవన్నీ జేమ్స్ బాండ్ పాత్రకు ఆయన సరిగ్గ సరిపోతాడు అనిపిస్తాయి. కానీ ఎందుకో మన ఇప్పటివరకు తన కెరీర్‌లో ఆ పని చేయలేదు.
ఓ టీవీని హోస్ట్ చేయాలని కృష్ణ తన సన్నిహితుల దగ్గర చెప్పేవారట. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ లాంటి షోను హోస్ట్ చేయాలనేది కృష్ణ కోరికట. అలాంటి కాన్సెప్ట్‌తో ఎవరైనా వస్తే రెడీ అనేవారట కృష్ణ. అయితే ఆయనకు అలాంటి ఆఫర్లు ఏవీ రాలేదు. తన దగ్గరకు రాని అవకాశానికి దూరంగా ఉండటం ఆయనక అలవాటు. ఇక్కడా అదే చేశారు. ఎందుకంటే అవకాశాలు క్రియేట్ చేసుకోవడం, వచ్చినవాటిని అదిరిపోయేలా తీర్చిదిద్దడం కృష్ణ నైజం.
ఇద్దరు కొడుకుల్ని బాలనటులుగా పరిచయం చేశారు కృష్ణ. రమేశ్ బాబు, మహేష్‌బాబుతో కలసి నటించారు కూడా. అయితే మనవడితో కలసి నటించాలి అనేది ఆయన కోరిక. ‘వన్ – నేనొక్కడినే’ సినిమాలో గౌతమ్ కృష్ణ నటించినప్పుడు.. కృష్ణ తన మనసులో మాట బయటపెట్టారు. కానీ ఈ కోరిక కూడా తీరలేదు.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!