Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!
- April 14, 2026 / 03:50 PM ISTByPhani Kumar
టాలీవుడ్ లో మళ్ళీ నిర్మాతలు మరియు థియేటర్ యాజమాన్యాల(ఎగ్జిబిటర్లు) మధ్య వివాదం ముదిరింది. గతేడాది జూన్ టైంలో కూడా ఇలానే వివాదాలు రేగడం.. హరిహర వీరమల్లు సినిమా విడుదలను ఆపేందుకు దిల్ రాజు వంటి పెద్ద నిర్మాతలు ఎగ్జిబిటర్లు ప్రయత్నిస్తున్నారు అంటూ ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ఆరోపించడం .. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడం జరిగింది. దీంతో అగ్ర నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ దానిపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత అంతా సెట్ అయ్యింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చినట్టు కనిపిస్తోంది.
Theaters
తెలంగాణ రాష్ట్రంలోని ఎగ్జిబిటర్లు ‘పర్సంటేజ్ సిస్టమ్’ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.అయితే అగ్ర నిర్మాతలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.దీని వల్లే ఇప్పుడు పెద్ద రచ్చ జరిగేలా ఉంది. వసూళ్లలో థియేటర్ యాజమాన్యాలకు నిర్ణీత శాతం వాటా ఇస్తే ధియేటర్ వ్యవస్థ బాగుపడుతుంది అనేది ఎగ్జిబిటర్ల అభిప్రాయం. కానీ భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్న నిర్మాతలు, గిల్డ్ సభ్యులు మాత్రం ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు.

ఈ క్రమంలో తమ డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే మే 1వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లను మూసివేస్తామని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ హెచ్చరించింది. టాలీవుడ్ ప్రముఖులు సురేష్ బాబు మరియు దిల్ రాజు మినహా, మిగిలిన నిర్మాతలందరూ ఈ పర్సంటేజ్ విధానానికి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో ఎవ్వరూ తగ్గడం లేదు. మే నెల అంటే స్కూల్స్ కి సెలవులు ఉంటాయి. కాబట్టి.. థియేటర్లకు జనాలు ఎక్కువగా వచ్చే సీజన్. అలాంటి.. సీజన్ లో ఎగ్జిబిటర్లు బంద్ బాట పడితే .. నిర్మాతలు భారీగా నష్టపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.
‘జన నాయగన్’ లీక్.. రంగంలోకి ఎడిటర్స్ యూనియన్.. ఏమైందంటే?














