Himaja: నటి హిమజ ఇంట్లో చోరీ.. వైరల్ అవుతున్న CCTV ఫుటేజ్..!

  • September 7, 2022 / 01:11 PM IST

సీరియల్స్ ద్వారా కెరీర్ ను ప్రారంభించిన హిమజ అటు తర్వాత ‘శతమానం భవతి’ ‘మహానుభావుడు’ ‘ధృవ’ ‘వినయ విధేయ రామ’ ‘నెక్స్ట్ నువ్వే’ వంటి చిత్రాల్లో నటించింది. ‘బిగ్ బాస్ 3’ లో కూడా ఈమె ఎంట్రీ ఇచ్చి డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్ గా నిరూపించుకున్న సంగతి తెలిసిందే. 2 నెలల పాటు హౌస్ లో కొనసాగిన హిమజ.. అటు తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా హిమజ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

యూట్యూబ్ లో అయితే ‘ఇట్స్ హిమజ’ పేరుతో ఒక ఛానల్ ని కూడా రన్ చేస్తుంది. ఇందులో ఆమె బ్యూటీ టిప్స్ కి సంబంధించిన వీడియోలు, హోమ్ టూర్ వీడియోలు, పండగలకి సంబంధించిన వీడియోలు చేస్తుంటుంది.ఇదిలా ఉండగా.. హిమజ ఇంట్లో దొంగతనం జరిగినట్టు,CCTV ఫుటేజ్ బయటకొచ్చినట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అవును ఇటీవల హిమజ ఇంట్లో దొంగ దూరాడు. ఇది నిజం. అయితే సీసీ టీవీ కెమెరాలు ఉండడం వల్ల హిమజ ఆ దొంగని పట్టుకుంది.

కానీ అతని పై ఆమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ దొంగ పై జాలితో కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసింది. ఆ దొంగ కూడా తన తప్పు తెలుసుకుని క్షమించమని కోరాడు. ఈ విషయం పై హిమజ అభిమానులకి అవేర్నెస్ కలిగించేలా ఓ వీడియో చేసింది. ఇందులో సీసీ టీవీ, కెమెరా ప్రాముఖ్యత గురించి తెలిపింది. ‘మన జాగ్రత్తలో మనం ఉండటం తప్పు కాదు, సీసీ టీవీ కెమెరా ఉంటే సెక్యూరిటీ ఉంటుంది’ అంటూ హిమజ చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!


భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus