Jr NTR, Balakrishna: ఆ పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారా?

బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబో మూవీ భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు టైటిల్ ను ప్రకటించకపోవడంతో వేర్వేరు టైటిల్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. బాలయ్యకు జోడీగా శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తుండగా దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. అయితే ఈ సినిమాలో బాలయ్య పాత్ర పేరుకు సంబంధించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తుండగా ఒక పాత్ర పేరు జై అని తెలుస్తోంది. జై లవకుశ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించగా ఆ పాత్రల్లో ఒక పాత్ర పేరు జై అనే సంగతి తెలిసిందే. తారక్ నటించిన జై లవకుశ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాలకృష్ణ కూడా జై పేరు ఉన్న పాత్రలో నటిస్తూ ఉండటంతో ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ కామెంట్లు వినిపించాయి. అఖండ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న బాలకృష్ణ ఈ సినిమాతో ఆ సినిమాకు మించిన సక్సెస్ ను అందుకోవాలని భావిస్తున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో బాలయ్య 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బాలయ్య కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సక్సెస్ లో ఉండటంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్న డైరెక్టర్లకు మాత్రమే బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. బాలయ్య సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులు సైతం మంచి రేటుకు అమ్ముడవుతున్నాయి. తర్వాత ప్రాజెక్ట్ లతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. బాలయ్య సినిమాల బడ్జెట్లు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus