హ్యాట్రిక్ హిట్లతో కొరటాల శివ టాలీవుడ్ లో టాప్ డైరక్టర్ల లిస్ట్ లో చేరారు. ఆయన తీసిన మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ సినిమాలు కలక్షన్ల సునామీ సృష్టించాయి. దీంతో కొరటాల సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించనున్న మూవీపై విపరీత క్రేజ్ ఏర్పడింది. ఇందులో కీలకమైన పాత్రలో నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కొరటాల మిర్చిలో సత్యరాజ్, శ్రీమంతుడు లో జగపతిబాబు, జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ .. ఇలా ఒక సీనియర్ హీరోని కీలక పాత్రలో నటింపచేశారు.
అలాగే మహేష్ కొత్త సినిమాకు బాలయ్యను తీసుకున్నట్లు ప్రచారం మొదలయింది. ఈ గాసిప్ డైరక్టర్ వద్దకు చేరడంతో ఆయన ఈరోజు (బుధవారం) స్పందించారు. “నా తర్వాతి చిత్రంలో ఫ్యాన్సీ కాంబినేషన్లు లేవు. అది మల్టీ స్టారర్ చిత్రం కాదు” అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. బాలయ్య, మహేష్ పేర్లు చెప్పకుండా, వారి కాంబినేషన్ పై వచ్చిన వార్తలన్నింటిని ఖండించారు.
There are no fancy combos in my next film nor it’s a multi starrer. Request all of u to ignore all the speculations.