ఈ నలుగురు డైరెక్టర్స్ రాజమౌళిని మించిపోయేలా ఉన్నారుగా..!

ఎస్.ఎస్.రాజమౌళి టాలీవుడ్లో అపజయమెరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నాడు. అందుకే ఇతన్ని ‘స్యూర్ సక్సెస్ రాజమౌళి’ అని కొందరు అంటుంటారు. ‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసాడు. ఇప్పుడు మన తెలుగు సినిమాలు బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతున్నాయి అంటే అది రాజమౌళి చలువే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ప్రస్తుతం రాజమౌళి పాన్ ఇండియా లెవెల్లో స్టార్ డైరెక్టర్. అతను డైరెక్ట్ చేస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం 10భాషల్లో విడుదల కాబోతుంది.

ఇదిలా ఉండగా.. పాన్ ఇండియా సినిమాలు రాజమౌళి మొదలుపెట్టక ముందు వినాయక్ కూడా రాజమౌళితో సమానంగా ఉండేవాడు. అయితే ఇప్పుడు రాజమౌళి దరిదాపుల్లో కూడా వినాయక్ లేడు. ఇప్పుడు రాజమౌళిని మ్యాచ్ చేసే దర్శకుడు కనిపించడం లేదు. అయితే కొంతమంది దర్శకులకు మాత్రం రాజమౌళిని మ్యాచ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వారు చేస్తున్న ప్రాజెక్టులను బట్టి చూస్తుంటే రాజమౌళిని మించిపోయినా ఆశ్చర్య పడనవసరం లేదు. ఇంతకీ ఆ దర్శకులు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) సుకుమార్:

ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘పుష్ప’ చిత్రం చేస్తున్నాడు సుకుమార్. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతుంది. సుకుమార్ గత చిత్రం ‘రంగస్థలం’ పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానప్పటికీ 220 కోట్ల గ్రాస్ వరకూ నమోదు చేసింది. ఇప్పుడు బన్నీతో మూవీ చేస్తున్నాడు. అతనికి మలయాళం, హిందీ లో కూడా పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. కాబట్టి ‘పుష్ప’ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో విజయం సాధిస్తే రాజమౌళికి చెక్ పెట్టినట్టే..!

2) ప్రశాంత్ నీల్:

‘కె.జి.ఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో విజయం సాధించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈయన తెరకెక్కిస్తున్న ‘కె.జి.ఎఫ్2’ తో పాటు.. ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చెయ్యబోతున్నాడు. ఆ తరువాత ప్రభాస్ తో కూడా ఓ సినిమా చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ పాన్ ఇండియా డైరెక్టర్ అనే ముద్ర ప్రశాంత్ నీల్ పై పడింది. ఒకవేళ తరువాతి సినిమాలు కూడా విజయం సాధిస్తే రాజమౌళి ని మ్యాచ్ చేసే అవకాశాలున్నాయి.

3) నాగ్ అశ్విన్:

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ వంటి క్లాస్ హిట్ తో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ యంగ్ డైరెక్టర్ ఆ తరువాత … ‘మహానటి’ సావిత్రి జీవితాన్ని ఎంతో అందంగా ప్రెజెంట్ చేసి …ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలందరినీ ఆశ్చర్యపరిచాడు. బాక్సాఫీస్ వద్ద కూడా ఆ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ప్రభాస్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. సింగిల్ సిట్టింగ్ లో ప్రభాస్ ఈ చిత్రాన్ని ఓకే చేసాడు. ఈ చిత్రం హిట్ అయితే ఇతను కూడా రాజమౌళిని మ్యాచ్ చేసే అవకాశాలున్నాయి.

4) ఓం రౌత్:

మరాఠిలో ‘లోకమాన్య : ఏక్ యుగ పురుష్’ అనే చిత్రాన్ని తెరకెక్కించి ఫిలింఫేర్ అవార్డుని దక్కించుకున్నాడు. అటు తరువాత ‘తానాజీ’ అనే చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో ‘ఆది పురుష్’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం కనుక హిట్ అయితే ఓం రౌత్ కూడా రాజమౌళికి చెక్ పెట్టినట్టే అని చెప్పాలి.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus