బాలీవుడ్ షేక్ అయిపోతోంది బ్రదరూ..!

బాహుబలి క్రియేట్ చేసిన సెన్సేషన్ తో సౌత్ నుంచి సినిమాలు వస్తున్నయంటే బాలీవుడ్ బాక్సాఫీస్ గడగడలాడిపోతోంది. ముఖ్యంగా అక్కడ స్టార్ హీరోలు సైతం ఈ సినిమాలు రిలీజ్ డేట్స్ ని దృష్టిలో పెట్టుకుని మరీ వాళ్ల సినిమాలని రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, స్టార్ హీరోలు అనుకున్నవాళ్ల మార్కెట్ కూడా ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్ హీరోల మార్కెట్ కి ఈక్వల్ అయిపోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ప్రభాస్ సాహో సినిమా తర్వాత తెలుగు సినిమాల స్వరూపమే మారిపోయింది. సినిమా పరంగా రిజల్డ్ సరిగ్గా రాకపోయినా బాలీవుడ్ లో మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్స్ నే క్రియేట్ చేసింది ఈ సినిమా. అయితే, ఇప్పుడు ఈసారి కూడా ముఖ్యంగా నాలుగు సినిమాలు షేక్ చేయబోతున్నాయి.

కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే బాలీవుడ్ లో బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలాగానే కనిపిస్తోంది. ఒకవేళ మిక్స్ డ్ టాక్ వచ్చినా కూడా కలక్షన్స్ పరంగా మాత్రం దుమ్మురేపడం గ్యారెంటీ. కన్నడ ఇండస్ట్రీ చేసిన ఈ కేజీఎఫ్ మాయ బాలీవుడ్ ని షేక్ చేస్తోంది. ఇందులో రవీనా టాండన్, సంజయ్ దత్ ఇలా బాలీవుడ్ స్టార్స్ ఉండటం అనేది ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. సినిమా పరంగా ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా ఒక్క హిందీలోనే సినిమా 500కోట్ల మార్క్ ని అందుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. కేజీఎఫ్ సినిమా పక్కనబెడితే,

నెక్ట్స్ ఈ సంవత్సరం రాబోతున్న రాజమౌళి ట్రిబుల్ ఆర్ సినిమాకి కూడా హ్యూజ్ రెస్పాన్స్ ఖచ్చితంగా వస్తుంది. ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ చేయడం ఒక ఎత్తు అయితే, బాలీవుడ్ స్టార్స్ అయిన అజయ్ దేవగన్, అలియాభట్ ఉండటం కూడా బాలీవుడ్ లో సినిమాకి మంచి ఓపెనింగ్స్ ని తెచ్చిపెడతాయి. సో, రాజమౌళి సినిమా ఈసారి కూడా బాలీవుడ్ ని షేక్ చేయడం పక్కాగానే కనిపిస్తోంది. యావరేజ్ టాక్ వచ్చినా కూడా 300 కోట్ల నుంచి 500 కోట్ల వరకూ స్టామినా ఉంది ఈ సినిమాకి.

తర్వాత ఇదే సంవత్సరం టార్గెట్ చేస్తూ రాధేశ్యామ్ అంటూ ప్రభాస్ వస్తున్నాడు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీని పాన్ ఇండియా రేంజ్ లో చూపించే సినిమా ఇది. ఏమాత్రం లవ్ స్టోరీ బాలీవుడ్ బ్రదర్స్ కి కనెక్ట్ అయినా పక్కా హిట్ గ్యారెంటీ. అందులోనూ ప్రభాస్ కి బాలీవుడ్ లో స్టాండెట్ మార్కెట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కూడా భారీగానే ఓపెనింగ్స్ ని తెచ్చిపెడుతుంది. ఒకవేళ ఫ్లాప్ టాక్ వచ్చినా సినిమా మాత్రం ఖచ్చితంగా వసూళ్ల పరంగా హిట్ అవుతుంది నో డౌట్.

ఇదే ఇయర్ లో ఈసారి అల్లు అర్జున్ కూడా బాలీవుడ్ మార్కెట్ ని కొల్లగొట్టేందుకు చూస్తున్నాడు. పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఐదుభాషల్లో రిలీజ్ చేస్తున్నట్లుగా ముందుగానే ప్రకటించారు. అంతేకాదు, లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా బాలీవుడ్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేసింది. యూట్యూబ్ లో సాంగ్స్ కి ఫిదా అయిపోయారు కూడా. సో, అల్లు అర్జున్ ఈసారి బాలీవుడ్ మార్కెట్ ని గట్టిగానే గ్రాబ్ చేస్తాడు.

వీటితో పాటుగా ఈసారి లైగర్ అంటూ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా బాలీవుడ్ మార్కెట్ పైనే కన్నేశాడు. పూరీ జగన్నాథ్ సినిమాలకి బాలీవుడ్ లో మంచి గిరాకీ ఉంది. అమితాబ్ తో తీసిన సినిమా మంచి సక్సెస్ అవ్వడం అనేది ఇప్పుడు లైగర్ సినిమాకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అందులోనూ కరణ్ జోహార్ ఈ సినిమాని భారీగా రిలీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈసారి మన రౌడీ స్టార్ కూడా బాలీవుడ్ లో ఖచ్చితంగా తొడగొడతాడు.

కేజీఎఫ్ కన్నడ సినిమా అని మనం లైట్ తీస్కున్నా, తెలుగులో మాత్రం రాబోతున్న ఈ నాలుగు సినిమాలు ఖచ్చితంగా దుమ్ముదులపడం గ్యారెంటీగానే కనిపిస్తోంది. ఈ నాలుగు సినిమాలు చాలు.. బాలీవుడ్ ని షేక్ చేయడానికి అన్నట్లుగా ఈ సంవత్సరం మన స్టార్ హీరోలు , డైరెక్టర్స్ రెచ్చిపోతున్నారనే చెప్పాలి. అదీ విషయం.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus