సినిమా తియ్యడం ఎంత ముఖ్యమో దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే ఇంపార్టెంట్.. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ థియేటర్లను డామినేట్ చేస్తున్న ఈ రోజుల్లో అయితే ప్రమోషన్ అనేది ఎంత చేసినా ప్రేక్షకులు హాళ్లకు వస్తారని చెప్పలేం.. దాదాపుగా స్టార్ హీరోలెవరికీ ఈ ప్రాబ్లమ్ ఉండదు కానీ.. సినిమాకి పబ్లిసిటీ అనేది ఎంతైనా అవసరం.. ఇండియా తరపున ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ ని జ్యూరీ ఆస్కార్స్‌కి పంపకపోయినా.. టైమ్, డబ్బు ఖర్చు పెట్టి పర్సనల్‌గా ప్రమోట్ చేసి ఆస్కార్ సాధించారు దర్శకధీరుడు రాజమౌళి..
ట్రిపులార్ రిలీజ్ అయ్యి ఏడాది కావస్తున్నా ఇంకా ఆయన దాని గురించే పని చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.. పబ్లిసిటీ, మార్కెటింగ్ అనే వాటి మీద మేకర్స్‌కి అవగాహన ఉండాలి.. మన టాలీవుడ్ సినిమా స్థితిగతులు మారుతున్నాయి.. ‘బాహుబలి సిరీస్’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పుడు నాని ‘దసరా’, రాబోయే అఖిల్ ‘ఏజెంట్’ కూడా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటడానికి రెడీ అవుతున్నాయి.. ప్రపంచమంతా మన తెలుగు చిత్ర పరిశ్రమ, చిత్రాల వైపు చూసేలా చేశారు రాజమౌళి..
మంచి కంటెంట్, దానికి తగ్గ ప్రమోషన్ చేసి లార్జర్ దెన్ లైఫ్ అనేంతగా మన సినిమాలను విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఇక తెలుగు ఇండస్ట్రీకి ఓవర్సీస్ మార్కెట్ కూడా చాలా ఇంపార్టెంట్.. యూఎస్‌లో వందలాంది స్క్రీన్లలో పెద్ద పెద్ద ఏరియాల్లో తెలుగు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి.. ఈమధ్య కాలంలో ఇప్పటి వరకు అక్కడ అత్యధిక థియేటర్లలో (నాని దసరా) వరకు విడుదలైన, కానున్న సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి..