Anushka: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రానికి రీషూట్లు చేశారా?

కొంత గ్యాప్ తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నుండి రాబోతున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘యువీ క్రియేష‌న్స్’ బ్యాన‌ర్‌పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తుండగా.. మ‌హేష్ బాబు.పి డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో మహేష్ .. సందీప్ కిషన్ తో ‘రా రా కృష్ణయ్య’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆగ‌స్ట్ 4న తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ప్రమోషన్స్ ను కూడా ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ చేసింది చిత్ర బృందం. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే.. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులు చేశారట. అందువల్ల కొంత పార్ట్ ను రీ షూట్లు చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఇప్పుడు అందరూ సంతృప్తి చెందేలా సినిమా రెడీ అయ్యిందట. (Anushka) అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయట.

కామెడీ, పాటలు కూడా చాలా బాగా వచ్చాయని వినికిడి. త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేసి, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఘనంగా నిర్వహించే దిశగా టీం రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ‘జాతి రత్నాలు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుండి రాబోతున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus