మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. తరాలు మారుతున్నా చిరంజీవి సినిమాలను అభిమానించే ప్రేక్షకులు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. చిరంజీవి రీఎంట్రీలో వరుస సినిమాలతో బిజీ అవుతుండగా ప్రతి సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతున్నా కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోవడం లేదు. అయితే వాల్తేరు వీరయ్య తరహా మాస్ సినిమాలే చిరంజీవికి సూట్ అవుతాయని
చిరంజీవి సినిమా అంటే ఆయన మార్క్ ఎంటర్టైన్మెంట్ కచ్చితంగా ఉండాలని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆచార్య, గాడ్ ఫాదర్ తరహా సినిమాలు చిరంజీవికి సూట్ కావని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మరోవైపు మరో రెండు రోజుల్లో వాల్తేరు వీరయ్య బ్రేక్ ఈవెన్ అవుతుందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. కమర్షియల్ సినిమాలకు చిరంజీవి ప్రాధాన్యత ఇవ్వాలని కొంతమంది ఫ్యాన్స్ సూచనలు చేస్తున్నారు. చిరంజీవి వయస్సు పెరుగుతున్నా ఆయన లుక్ లో, ఎనర్జీలో ఏ మాత్రం మార్పు రాలేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. త్వరలో చిరంజీవి వరుస ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సీనియర్ హీరోలలో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న చిరంజీవి ప్రేక్షకులకు నచ్చే సినిమాలకు ఓటేస్తూ కెరీర్ ను విజయవంతంగా కొనసాగించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. చిరంజీవి ఒక్కో సినిమాకు 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
సొంత బ్యానర్ లో తెరకెక్కిన సినిమాల కంటే బయటి బ్యానర్లలో తెరకెక్కిన సినిమాలే చిరంజీవికి కలిసొస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి సినిమాలకు డైరెక్టర్లుగా వ్యవహరించడానికి యంగ్ జనరేషన్ డైరెక్టర్లు సైతం ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. చిరంజీవి సినిమాలు సక్సెస్ సాధించి బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?