గ్లోబల్ స్టార్ రాంచరణ్ హీరోగా పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆల్ టైం హిట్ మూవీ ‘రంగస్థలం’. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై వై.నవీన్, వై.రవి శంకర్, సి.వి.మోహన్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2018 వ సంవత్సరం మార్చి 30న విడుదలైంది. నేటితో ఈ చిత్రం విడుదలై 5 ఏళ్ళు పూర్తి కావస్తోంది. 1985 వ సంవత్సరంలో గోదావరి జిల్లాల వాతావరణం, అక్కడి నేపథ్యం, అణగదొక్కడం, రాజకీయాలు ఎలా ఉండేవి…
అనే అంశాలతో రివేంజ్ డ్రామాగా ఈ మూవీని తీర్చిదిద్దాడు సుకుమార్. మొదట ఈ మూవీ పై అంచనాలు అంతంత మాత్రంగానే ఉండేవి. కానీ మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకోవడంతో భారీ కలెక్షన్లను నమోదు చేసింది ఈ చిత్రం. వినికిడి ఇబ్బంది కలిగిన వ్యక్తి చిట్టిబాబుగా రాంచరణ్ నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. అలాగే ఈ చిత్రంలో పనిచేసిన నటీనటులందరికీ ప్రశంసలు దక్కాయి. అయితే ఈ చిత్రాన్ని కొంతమంది స్టార్లు మిస్ చేసుకోవడం జరిగింది. వాళ్ళెవరో ఓ లుక్కేద్దాం రండి :
1) అనుపమ పరమేశ్వరన్ :
ఈ చిత్రంలో సమంత పోషించిన రామ లక్ష్మి పాత్ర కోసం మొదట అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. దీంతో సమంతని ఫైనల్ చేశారు.
2) రాజశేఖర్ :
జగపతి బాబు పోషించిన ప్రెసిడెంట్ పాత్రకు మొదట రాజశేఖర్ ను సంప్రదించాడు సుకుమార్. కానీ ఆయన ఒప్పుకోలేదు.
3) రాశి :
అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్ర కోసం ఈ సీనియర్ స్టార్ హీరోయిన్ ను అడిగారు. కానీ ఆ పాత్ర వస్త్రాలంకరణ నచ్చక ఆమె నొ చెప్పింది.
4) పృథ్వీ రాజ్ :
‘రంగస్థలం’ (Rangasthalam) లో 30 ఇయర్స్ పృథ్వీ కూడా నటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన పాత్ర ఎడిటింగ్ లో లేపేయడం జరిగింది.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?