Bheemla Nayak Trailer: ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ ఎన్ని నిమిషాలు? హైలెట్స్ ఇవే..!

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలియికలో తెరకెక్కిన క్రేజీ మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’ మరో 4 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్లని కూడా వేగవంతం చేసింది చిత్ర బృందం. అయితే ఈరోజు జరగాల్సిన ప్రీ రిలీజ్ వేడుక ఏపి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హాఠాన్మరణంతో వాయిదా పడింది. ఇదిలా ఉండగా.. ఈరోజున ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

Click Here To Watch

ఈరోజు రాత్రి 8 గంటల 10 నిమిషాలకి ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ అది జరుగుతుందో లేదో ప్రస్తుతానికైతే సస్పెన్స్. అయితే ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనే దాని పై కొన్ని విషయాలు కొన్ని బయటకి వచ్చాయి. వాటి ప్రకారం భీమ్లా నాయక్ ట్రైలర్ 2 నిమిషాల 14 సెకండ్లు ఉండబోతుందట. ఈ ట్రైలర్ లో పవన్ ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని.. అలాగే రానా పాత్ర కూడా తగ్గకుండా సినిమా పై ఆసక్తి కలిగించే విధంగా ఉంటుందని వినికిడి.

పవన్ నోటి నుండీ వచ్చే డైలాగులకి ఫ్యాన్స్ కు గూజ్ బంప్స్ వస్తాయని, ఈ సినిమాలో నటించే నటీనటులకు సంబంధించి వాటి పాత్రల పై కొంత క్లారిటీ కూడా వస్తుందని తెలుస్తుంది. ట్రైలర్ చివర్లో పవన్,రానా లు కొట్టుకునే సీన్ తాలూకు విజువల్ కూడా చూపించే ప్రయత్నం జరిగిందట. ఈ ట్రైలర్ కు తమన్ అందించిన బి. జి.యం హీరోలని మించి హైలెట్ అవుతుందని వినికిడి.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus