హీరో కత్తి చేత్తో పట్టుకుని విలన్ ని లేదా అతని గ్యాంగ్లో ఎవరొకరి తల నరికితే… మాస్ ఆడియన్స్ బాగా సంతృప్తి చెందుతారు. అయితే దానికి తగ్గ ఎమోషన్ కూడా కథకు తగ్గట్టు బిల్డ్ చేసి ఉండాలి.మాస్ సినిమాల్లో ఎక్కువగా ఇలాంటి సీన్లు ఉంటాయి. అయితే ఇవి ఏ సందర్భంలో వస్తాయో ఈజీగా చెప్పేయొచ్చు. ఒకటి హీరోకి ఫ్యామిలీ మెంబర్స్ ని కిరాతకంగా చంపేసిన విలన్ లేదా అతని గ్యాంగ్ పై హీరో రివేంజ్ తీర్చుకునేప్పుడు, లేదా హీరోకి బంధువుల్లో లేదా అతని మనుషులకు సంబంధించిన ఆడవాళ్ళలో ఎవరొకరిని చెరిపినప్పుడు..
అందుకు సంకేతంగా హీరో విలన్ లేదా అతని బ్యాచ్ తలలు నరికినట్టు చూపిస్తారు. ఈ రెండు అంశాలపైనే మాస్ సినిమాల్లో హీరోలు తలలు నరకడం అనేది ఆనవాయితీగా వస్తోంది. బి.గోపాల్ (B. Gopal), రాజమౌళి(S. S. Rajamouli), వి.వి.వినాయక్ (V. V. Vinayak) , సురేందర్ రెడ్డి (Surender Reddy), బోయపాటి శ్రీను (Boyapati Srinu) వంటి మాస్ డైరెక్టర్ల సినిమాల్లో ఇలాంటి విపరీతమైన వయొలెన్స్ తో కూడుకున్న సన్నివేశాలు కనపడేవి. ఇప్పటికీ కనిపిస్తున్నాయి కూడా.
హీరోల్లో చూసుకుంటే బాలకృష్ణ (Nandamuri Balakrishna), చిరంజీవి (Chiranjeevi), ఎన్టీఆర్ (Jr NTR) ,ప్రభాస్(Prabhas), అల్లు అర్జున్ (Allu Arjun), రవితేజ (Ravi Teja) , రాంచరణ్ (Ram Charan), వెంకటేష్ (Venkatesh Daggubati),నాగార్జున (Nagarjuna),రజినీకాంత్ (Rajinikanth) వంటి స్టార్ హీరోలతో (Star Heroes) పాటు కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram), నాని (Nani), వైష్ణవ్ తేజ్ (Vaisshnav Tej) వంటి మిడ్ రేంజ్ హీరోలు కూడా తలలు నరికే సీన్స్ లో నటించారు. అయితే ఇద్దరు స్టార్ హీరోలు (Star Heroes) మాత్రం ఇప్పటికీ తలలు నరికే సన్నివేశాల్లో నటించలేదు. వాళ్ళు మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) .
కరెక్ట్ గా గమనిస్తే వీళ్ళ సినిమాల్లో కత్తులు పట్టుకొని తలలు నరికే సన్నివేశాలు లేవు. ఎక్కువ సినిమాల్లో ఇద్దరి చేతుల్లో ఎక్కువగా తుపాకులు కనిపిస్తాయి. వాటితోనే నచ్చినట్టు యాక్షన్ ఫీట్లు చేస్తూ కనిపించారు. కత్తులు పట్టుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువే. చాలా వరకు వీళ్ళు సెన్సిటివ్ కూడా. అందుకే అలాంటి అతి భయంకరమైన వయొలెన్స్ సీన్స్ కి.. దూరంగా ఉన్నారు అనుకోవచ్చు.