వినోదాన్ని ప్రధానంగా చేసుకొని, చిరాకును ఐసింగ్ ఆన్ కేక్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘ఎఫ్ 2’. ఆ సినిమా విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ‘ఎఫ్ 3’ తీసుకొస్తున్నారు. ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. అయితే అప్పుడే ‘ఎఫ్ 4’ ముచ్చట్లు జరుగుతున్నాయి. ‘ఎఫ్’తో ఓ సిరీస్‌నే రన్ చేయాలని అనిల్ రావిపూడి – దిల్ రాజు అనుకోవడమే దీనికి కారణం. అయితే ‘ఎఫ్ 4’లో మరో హీరో యాడ్ అవుతాడని దర్శకుడు చెబుతున్నారు.
నిజానికి ‘ఎఫ్ 3’ అనుకుంటున్న తొలి రోజుల్లో మూడో హీరో సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నాడని అనుకున్నారు. అది కూడా రవితేజనే ఆ హీరో అని కూడా చెప్పారు. చాలా రోజుల ఈ విషయంలో చర్చలు, పుకార్ల వడ్డింపులు జరిగాక, తూచ్.. అలాంటిదేం లేదు. ఇద్దరు హీరోలతోనే ‘ఎఫ్ 3’ చేస్తున్నారు అని చెప్పారు. బయటకు చెప్పలేదు కానీ, ముగ్గురు హీరోలు అనుకున్నా, ఇద్దరు హీరోలకే తర్వాత ఫిక్స్ అయ్యారు అని సమాచారం. అయితే ‘ఎఫ్ 4’లో మూడో హీరో ఉండొచ్చు అంటున్నారు అనిల్ రావిపూడి.
మూడో హీరో గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘‘మూడో హీరో ఆలోచన ‘ఎఫ్ 3’ టైమ్‌లో వచ్చింది. అయితే అప్పుడే వాడేస్తే తర్వాత సినిమాలకి ఏమీ ఉండదనిపించింది. అందుకే ఆ ఆలోచనని పక్కనపెట్టి ‘ఎఫ్ 2’ తారలతోనే ‘ఎఫ్ 3’లో వీలైనంత వినోదాన్ని సృష్టించాం. ‘ఎఫ్ 4’లో కానీ, ఆ తర్వాత సినిమాల్లో కానీ మూడో హీరో తప్పకుండా వస్తాడు’’ అని చెప్పారు. అయితే మూడో హీరో రావడం పక్కా ఎప్పుడు అనేది త్వరలో తేలుతుంది.
‘ఎఫ్ 3’ ఫలితం బట్టే ‘ఎఫ్ 4’ ఉంటుంది అనేది పక్కా. మరోవైపు ‘ఎఫ్ 3’ అడ్వాన్స్ బుకింగ్‌లు ఆశించిన స్థాయిలో లేవు అని చెబుతున్నారు. నగరంలోని చాలా థియేటర్లలో ఇంకా పూర్తి స్థాయి బుకింగ్ అవ్వలేదట. దానికి టికెట్ ధరలు కూడా కారణమని తెలుస్తోంది. సాధారణ టికెట్ ధరలు అని చెప్పి మల్టీప్లెక్స్‌లో రూ.295, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.175 వసూలు చేస్తున్నారు. వీటికి ట్యాక్స్‌లు, సర్వీసు ఛార్జీలు అదనం అని మరచిపోకూడదు. మరి సినిమా విడుదలయ్యాక టాక్ బట్టి బుకింగ్ జోరందుకుంటుందేమో చూడాలి.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!