బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఆట అనేది రసవత్తరంగా మారింది. మొదటివారమే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఇప్పటికే శ్రీసత్య ఆర్మీ అంటూ కొంతమంది పేజ్ లు కూడా పెట్టేశారు. కానీ, శ్రీసత్యకి మాత్రం అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో పెద్దగా రెస్పాన్స్ ఏమీ రావడం లేదు. మొదటి వారం నామినేషన్స్ లో చూసినట్లయితే, శ్రీసత్యతో పాటుగా, ఆరోహిరావ్, అభినయశ్రీ, ఇనయాసుల్తానా, ఫైమా, చంటి ఇంకా రేవంత్ లు ఉన్నారు. వీళ్లలోనే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది.
అయితే, ఈసారి పార్టిసిపెంట్స్ కి మాత్రం కేవలం రెండు రోజులు మాత్రమే టైమ్ ఉంది. గతంలో సోమవారం రాత్రి నుంచీ శుక్రవారం రాత్రి వరకూ పోలింగ్ సైట్స్ అందుబాటులో ఉండేవి. కానీ, ఈసారి మొదటి వారమే బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఫస్ట్ వీక్ బుధవారం వరకూ నామినేషన్ లిస్ట్ పెట్టలేదు. అంతేకాదు, గురువారం మార్నింగ్ మాత్రమే హాట్ స్టార్ లో ఓటింగ్ కనిపిస్తోంది. దీంతో రెండు రోజుల్లో రిజల్ట్ అనేది ప్రేక్షకులు ఏది నిర్ణయిస్తే అదే ఫైనల్ అవుతుంది.
ఇప్పటికే అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో చూస్తే రేవంత్ 25 శాతం వరకూ ఓటింగ్ ని ప్రబావితం చేశాడు. టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అలాగే, జబర్ధస్త్ చంటి, ఫైమాలు కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇక మిగిలిన నలుగురు అమ్మాయిల్లో నుంచే ఎలిమినేషన్ అనేది ఉండబోతోంది. మరి ఈ నలుగురులో చూసినట్లయితే ఇనయ సుల్తానా , ఆరోహి రావ్ ఇద్దరూ కూడా కొద్దిగా వెనకబడ్డారనే చెప్పాలి. ఫస్ట్ వీక్ లోనే స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్స్ వెళ్లిపోతే వాళ్లకి గేమ్ ఆడే అవకాశం దక్కదు.
ఇప్పుడు మరి శుక్రవారం ఓటింగ్ ని బట్టే పార్టిసిపెంట్స్ భవితవ్యం ఆధారపడి ఉంది. ఇనయ సుల్తానా, ఆరోహిరావ్ ఇద్దరిలో ఒకరు ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, అభినయశ్రీ ఇంకా శ్రీసత్య ఇద్దరూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఆఖరి రోజు ఓటింగ్ లో వీళ్లలో ఒకరు కిందకి దిగితే మాత్రం వీరిద్దరిలో కూడా ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అనేది హౌస్ మేట్స్ గుండెల్లో గుబులు పుట్టించడం మాత్రం పక్కా. అదీ మేటర్.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!