Jr NTR: వార్ 2 లో ఎన్టీఆర్ స్థానంలో ముందుగా ఆ హీరోని అనుకున్నారా.. ఏమైందంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతూ ఎంతో బిజీగా ఉన్నారు. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఈయన కొరటాల శివ దర్శకత్వంలో బిజీగా మారిపోయారు. కొరటాల శివ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బిజీగా ఉంటారని భావిస్తున్న అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఎన్టీఆర్ నుంచి వచ్చింది. ఈయన హృతిక్ రోషన్ నటిస్తున్నటువంటి వార్ 2 సినిమాలో నటిస్తున్నారంటూ తెలియజేశారు.

ఇలా ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్నారని వార్తలు తెలియడంతో ఎన్టీఆర్ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇకపోతే వార్ సినిమాలో హృతిక్ రోషన్ టైగర్ ష్రాప్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు అయితే ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో మాత్రం టైగర్ స్థానంలో ఎన్టీఆర్ అవకాశాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమాలో టైగర్ స్థానంలో ఎన్టీఆర్ (Jr NTR) కంటే ముందుగా మరొక టాలీవుడ్ హీరోని తీసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది.అయితే మరి ఆ హీరో ఎవరు? ఎందుకు ఆ హీరోని కాదని ఎన్టీఆర్ కి అవకాశం కల్పించారనే విషయానికి వస్తే.. వార్ 2 సినిమాలో టైగర్ స్థానంలో ముందుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండను తీసుకోవాలని మేకర్ యష్ రాజ్ ఫిలిమ్స్ వారు భావించారట. ఈయనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది.లైగర్ సినిమా ద్వారా మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు. అందుకే విజయ్ దేవరకొండను తీసుకోవాలని అప్పట్లో భావించారట.

ఇక లైగర్ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా పూర్తిగా డిజాస్టర్ కావడంతో ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు బదులు ఎన్టీఆర్ ను రంగంలోకి దింపారు. అలాగే ఎన్టీఆర్ కు హృతిక్ రోషన్ తో సమానంగా పాత్ర ఉండేలా స్క్రిప్ట్ లో కూడా మార్పులు చేస్తున్నట్టు సమాచారం. ఇక అయాన్ ముఖర్జీ సైతం బ్రహ్మాస్త్ర సినిమా తెలుగు ప్రమోషన్ కార్యక్రమాల సమయంలో ఈ విషయం గురించి ఎన్టీఆర్ తో మాట్లాడి ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కి ఏకంగా 75 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందిస్తున్నట్టు సమాచారం.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus