టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంతకు భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సమంత నటించిన శాకుంతలం సినిమా వచ్చే నెల 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే సమంత గత కొన్ని నెలలుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు సమంత మార్కెట్ పెరుగుతోంది. అయితే సమంతకు మీడియా సింపతీ శాపంగా మారిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
స్టార్ హీరోయిన్ సమంత సక్సెస్ రేట్ ఎక్కువనే సంగతి తెలిసిందే. ఏ మాయ చేశావె సినిమా నుంచి యశోద సినిమా వరకు సమంత నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే మీడియా సమంతపై ఎక్కువగా జాలి చూపిస్తుండటం గమనార్హం. చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా సమంత అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. సమంత హిందీ ప్రాజెక్ట్ లతో కూడా బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.
మరోవైపు సమంత ఫేస్ లో గ్లో తగ్గుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. సమంత కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. సమంత రాబోయే రోజుల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ కావాలని భావిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలుగు సినిమాలను తగ్గించాలని సమంత భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం గురించి సమంత ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
సామ్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి. ఒకవైపు తెలుగులో సినిమాలు చేస్తూనే మరోవైపు సమంత హిందీలో వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమంత మీడియాలో తన గురించి వస్తున్న వార్తల విషయంలో కూడా తెగ ఫీలవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్