సినిమా రంగంలో వరుస విజయాలు సాధించిన దర్శకులకు ఒక్క డిజాస్టర్ వల్ల కెరీర్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ కెరీర్ కు సంబంధించి ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇస్మార్ట్ శంకర్ మినహా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ సాధించినా ఆ సినిమాలో కూడా మైనస్ పాయింట్లు ఎక్కువగానే ఉన్నాయి.
పూరీ జగన్నాథ్ లైగర్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడని అందరూ భావించగా ఈ సినిమా మాత్రం 2022 బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. 200 కోట్ల రూపాయల ఓటీటీ ఆఫర్ వచ్చినా మేకర్స్ రిజెక్ట్ చేయడం ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ అయింది. ఓటీటీలో ఈ సినిమా విడుదలై ఉంటే పూరీ జగన్నాథ్ కు మాత్రం భారీగా లాభాలు మిగిలేవని చెప్పవచ్చు. గత కొన్నేళ్లలో పూరీ జగన్నాథ్ రైటింగ్ విషయంలో వీక్ అయ్యారు.
ఈ ఒక్క తప్పు వల్లే పూరీ జగన్నాథ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను సొంతం చేసుకోవడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకప్పటి పూరీ జగన్నాథ్ కు ఇప్పటి పూరీ జగన్నాథ్ కు తేడా ఇదేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూరీ జగన్నాథ్ సొంతంగా సినిమాలను నిర్మించడం కూడా ఆయనకు ఒకింత మైనస్ అవుతోందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పూరీ జగన్నాథ్ ఇతర రైటర్లు రాసిన కథలతో సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ ఇతర రైటర్ల కథలతో సినిమాలను తెరకెక్కిస్తే మాత్రం వరుస విజయాలను సొంతం చేసుకుంటారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. పూరీ జగన్నాథ్ ఈ విషయాలలో మారకపోతే మాత్రం భారీ స్థాయిలో నష్టం తప్పదని చెప్పవచ్చు.